Wednesday, May 1, 2024

ఎక్క‌డైనా స‌రే త‌గ్గేదేలే ! ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ లో అల్లు అర్జున్ స‌రికొత్త రికార్డ్..

సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో చేసిన ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోమాడు అల్లు అర్జున్. తాజాగా అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఫాలోయర్స్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్. ఇప్ప‌టికే ఈయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆయనకు 21.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. కాగా, రీసెంట్ గా ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ తీసుకొచ్చిన‌ ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ అనే కొత్త సోషల్ మీడియాలో మరో రికార్డును సాధించాడు ఐకాన్ స్టార్.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో కూడా సాధించని రికార్డును బన్నీ సొంతం చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ లో మన ఇండయన్ స్టార్స్ చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేశారు. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ ఉండ‌గా… ఎకౌంట్ ఓపెన్ చేసిన కొన్ని రోజుల‌కే 1 మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్నాడు బ‌న్నీ. ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో మరే సినీ స్టార్ కూడా ఈ ఘనతను సాధించి.. వన్ మిలియన్ ఫాలోయర్స్ ను సొంతం చేసుకున్న తొలి సినీ నటుడిగా బన్నీ రికార్డు సృష్టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement