Monday, April 29, 2024

కాశీలో యాత్రికులకు సకల సౌకర్యాలు..

ప్ర‌భ‌న్యూస్: తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో అధునాతన భవనం అందుబాటులోకి వచ్చింది. వారణాసిలోని పాండే హవేలీనందు అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం ఆధ్వర్యంలో ఈ నూతన భవనం ఏర్పాటైంది. కార్తీకమాసం, ఏకాదశి, సోమవారం తెల్లవారుజామున 4:05 ని.లకు కాశీ-పాండే హవేలీలో నిర్మించిన భవనానికి గృహ ప్రవేశం నిర్వహంచారు. 34 నూతన గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం కరివెన సత్రం ఈ భవనాన్ని నిర్మించింది.

ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం నాలుగు చోట్ల కరివెన సత్రం ఆధ్వర్యంలో నిత్యాన్నదానం, వసతి సౌకర్యం సేవలందిస్తోంది. రద్దీ పెరుగుతుండటంతో ఐదవ భవనాన్ని యాత్రికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. వారణాసికి వచ్చే తెలుగు యాత్రికులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ భవనాన్ని వినియోగించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement