Saturday, May 4, 2024

అహింస మూవీ ట్రైల‌ర్.. తేజ మార్క్ క‌నిపిస్తోందిగా

అహింస చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు అభిరామ్ ద‌గ్గుబాటి.ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు తేజ రూపొందిస్తున్నాడు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇది ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథ. ఆ ప్రేమకథకు చుట్టూ చట్టం .. న్యాయం .. నక్సలిజం నిలబడతాయి. తమ వ్యతిరేక శక్తుల నుంచి ఆ ప్రేమికులు తమ ప్రేమను ఎలా కాపాడుకుంటారనేదే కథ. ట్రైలర్ ను బట్టి చూస్తే ఇదే విషయం అర్థమవుతోంది. ఈ సినిమాతో తెలుగు తెరకి అభిరామ్ హీరోగా పరిచయమవుతున్నారు. హీరోయిన్ గీతికకి కూడా ఇదే ఫస్టు మూవీ. ఇక ఈ సినిమాతోనే ఆర్పీ పట్నాయక్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. రజత్ బేడీ .. సదా ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement