Friday, May 3, 2024

Latest | నిరాశ పరిచిన ఆదిపురుష్‌.. అభిమానుల ఆశ‌ల్నీ ఆ సినిమాపైనే

ఎంతో కాలంగా ప్ర‌భాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా “ఆదిపురుష్”. రిలీజ్ అయిన మూడు రోజులు మంచి క‌లెక్ష‌న్స్ చేసిన ఆ త‌రువాత‌ తీవ్ర‌ వివాదాల్లో కూరుకుపోయి ట్రోలింగ్‌ను ఎదుర్కొటుంది ఈ సినిమా. దీంతో ప్రభాస్ అభిమానులు “ఆదిపురుష్” ఫలితంతో పూర్తిగా సంతృప్తి చెందిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. కాగా, ప్ర‌స్తుతం ప్ర‌భాస్ అభిమానుల దృష్టి “సాలార్, “ప్రాజెక్ట్ K పై ప‌డింది. ఈ సినిమాల‌తో వారి హీరో మంచి కంబ్యాక్ ఇస్తాడ‌ని ఆశిస్తున్నారు. దీంతో ఈ సినిమాల‌ నిర్మాతలు కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చే చాన్స్ ఉంది.

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా “సాలార్” టీజర్‌ను జూలై మొదటి వారంలో లేదా జూన్ చివ‌రి వారంలో విడుదల చేయాలని మేక‌ర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 28న బిగ్ స్క్రీన్స్ పై రావ‌డానికి సిద్దంగా ఉంది.

మరోవైపు, దర్శకుడు నాగ్ అశ్విన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే క‌లిసి చేస్తున్న మెగా మూవీ “ప్రాజెక్ట్ కె”. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా అధికారిక టైటిల్‌ను రిలీజ్ చేసేందుకు సరైన డేట్ కోసం చూస్తున్నారు మేక‌ర్స్. “ప్రాజెక్ట్ K” అనేది వర్కింగ్ టైటిల్. అధికారిక టైటిల్ తో మోషన్ పోస్టర్‌ను యునైటెడ్ స్టేట్స్‌లో విడుదల చేయడానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నాట్టు స‌మాచారం. ఈ కార్యక్రమం జూలై మూడో తేదీన జరగనున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement