Monday, April 29, 2024

యాడ్ షూట్ కోసం -హ‌రీశ్ శంక‌ర్ తో అల్లు అర్జున్

డీజే చిత్రంకోసం క‌లిసి ప‌నిచేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్. ఇప్పుడు ఈ ఇద్దరూ మళ్లీ జత‌ కట్టారు. హరీశ్ దర్శకత్వంలో బన్నీ నటించాడు. దీనికి ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఛటర్జీ పని చేశాడు. అయితే, ఇది సినిమా కోసం కాదు. ఓ యాడ్ ఫిల్మ్ కోసం. ఈ యాడ్ త్వరలోనే విడుదల కానుంది. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల్లో కూడా బన్నీ దూసుకెళ్తున్నాడు. ప్రముఖ బ్రాండ్లకు తను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. ఇదివరకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బన్నీ పలు ప్రకటనల్లో నటించాడు. ఇప్పుడు తొలిసారి హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాణిజ్య ప్రకటనలో నటించాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ థాయ్ లాండ్ లో జరిగినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement