Friday, April 26, 2024

ఫోర్బ్స్‌ ఆసియా దాతృత్వ జాబితాలో అదానీ.. దేశం నుంచి మరో ఇద్దరికి చోటు

ఆసియాలో ఛారిటీ కార్యక్రమాలకు నిధులు ఇచ్చే వారి జాబితాను తాజాగా ఫోర్బ్స్‌ విడుదల చేసింది. దాతృత్వంలో ఆసియా హీరోలు పేరుతో 16వ ఎడిషన్‌ జాబితాను ప్రచురించింది. ఈ జాబితాలో ముగ్గురు భారతీయులకు చోటు దక్కింది. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ముందు వరసలో ఉన్నారు. ఈ సంవత్సరం జూన్‌లో జరిగిన అదానీ 60వ పుట్టిన రోజు నాడు ఛారీటీ కార్యక్రమాలకు 60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నిధులను చదువు, వైద్యం, నైపుణ్య శిక్షణ వంటి కార్యక్రమాల కోసం ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.

ఈ భారీ విరాళంతో అదానీ దాతృత్వంలో పరోపకారిగా ముందు వరసలో నిలిచినట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది. అదానీ ఫౌండేషన్‌ ద్వారా ఏటా 37 లక్షల మందికి అదానీ గ్రూప్‌ సాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. అనేక సంవత్సరాలుగా దాతృత్వ కార్యక్రమాలకు భారీగా నిధులు ఇస్తున్న శివ్‌ నాడార్‌ మరోసారి ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. శివ్‌ నాడార్‌ ఫౌండేషన్‌ ద్వారా ఆయన చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. స్కూళ్లు, యూనివర్శిటీలు ఏర్పాటు చేసి విద్యార్ధులకు తోడ్పాటు అందిస్తున్నారు.

ఈ సంవత్సరం ఆయన షౌండేషన్‌కు 11,600 కోట్లు విరాళంగా ఇచ్చారు. తాను నెలకొల్పిన మెడికల్‌ రీసెర్చ్‌ ట్రస్ట్‌కు 600 కోట్లు నిధులు సమకూరుస్త్తానని ప్రకటించిన టెక్‌ దిగ్గజం అశోక్‌ సూతా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వృద్ధాప్యం, నరాల సంబంధిత అనారోగ్యాలకు సంబందించిన పరిశోధనలకు 2021 ఏప్రిల్‌లో ఆయన స్కాన్‌ పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. రానున్న పదెళ్లలో ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. బెంగళూర్‌కు చెందిన హ్యాపీయెస్ట్ మైండ్స్‌ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాల ద్వారా ఆయనకు సంపద సమకూరుతోంది.

- Advertisement -

వీరితో పాటు మలేషియన్‌-ఇండియన్‌ బ్రహ్మల్‌ వాసుదేవన్‌, లాయర్‌గా ఉన్న ఆయన భార్య శాంతి కూడా ఈ జాబితాలో చేటు సంపాదించారు. వీరు నెలకొల్పిన క్రియేడర్‌ ఫౌండేషన్‌ ద్వారా మలేషియా, భారత్‌లో స్థానికులకు సాయం చేస్తున్నారు. మలేషియాలోని పెరక్‌ రాష్ట్రంలో టీచింగ్‌ హాస్పిటల్‌ ఏర్పాటుకు వీరు ఇద్దరు కలిసి 50 మిలియన్‌ మలేషియన్‌ రింగిట్‌ (11 మిలియన్‌ డాలర్ల) విరాళం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement