Monday, May 6, 2024

యువ రాజ‌కీయ నాయ‌కుడితో.. న‌టి ప‌రిణితి చోప్రా డేటింగ్..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో డేటింగ్ లు చేయ‌డం మామూలే.. కాగా ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో కెమెరా కంటికి చిక్కింది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా . ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు వైరల్ గా మారాయి. ఓ ఇంటి నుంచి వీరిద్దరూ బయటకొస్తూ కారు ఎక్కడం విశేషం. వీటిని ఫోటోలలో బంధించి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాతో పరిమితి చోప్రా డేటింగ్ లో ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా బాలీవుడ్ లో ఎక్కువగా లివింగ్ రిలేషన్ కథలకు దూరంగా ఉంటే పరిణితి చోప్రా కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి చేరుకోవడం విశేషం. అయితే ఇండస్ట్రీకి చెందిన వారితో కాకుండా ఆమె రాజకీయ నాయకుడితో కనిపించడం ప్రత్యేకత అని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement