Friday, May 10, 2024

OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న యాక్షన్ బ్లాక్‌బస్టర్ జాన్ విక్-4

ఇటీవల విడుదలైన హాలీవుడ్ యాక్షన్ మూవీ, కీను రీవ్స్ ప్రధాన పాత్రలో నటించిన జాన్ విక్: చాప్టర్ 4. ఆల్ టైమ్ బెస్ట్ యాక్షన్ సినిమాల‌లో ఒకటిగా నిలిచింది. యుఎస్‌లో ఆల్ రెడీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పుడు దేశంలోని OTT ప్లాట్‌ఫారమ్‌లో రిలీజ్ అయ్యేందుకు సిద్దంగా ఉంది.

- Advertisement -

ఈ సినిమా జూన్ 23న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ లయన్స్‌గేట్ ప్లే లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు ఓటీటీ సంస్థ ప్ర‌క‌టించింది. ఈ మూవీ కేవలం ఆంగ్లంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, హిందీ భాష‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement