Sunday, May 5, 2024

Vemulawada: హిజ్రాను పెళ్లి చేసుకున్న యువ‌కుడు

హిజ్రాను ఓ యువ‌కుడు పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న‌ వేములవాడలో చోటుచేసుకుంది. వేముల‌వాడ‌ రాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రంలో ఓ యువకుడు ఈరోజు ఓ హిజ్రాను పెళ్లి చేసుకున్నాడు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన హిజ్రా పింకీ(22)తో హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్‌(23) కు స్నేహం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో మూడు ముళ్లతో ఆ జంట ఒక్కటయ్యారు. హిజ్రా పింకీ, హైదరాబాద్ కు చెందిన శ్రీనివాస్ వేములవాడ రాజన్న సన్నిధిలో ఇవాళ మూడుముళ్లతో ఒక్కటయ్యారు. డిగ్రీ వరకు చదివిన శ్రీనివాస్, ప్రస్తుతం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement