Sunday, April 28, 2024

మరో సారి ఏకమైన సక్సెస్ ఫుల్ ట్రయో..

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన బ్రోచేవారెవరురా మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ట్రయో మరో సినిమా కోసం ఏకమయ్యారు. హుషారు ఫేమ్ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వీరు నటించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇంకా టైటిల్ కన్ఫార్మ్ కాని ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ఈ నెలాఖరులో కేరళలో జరగనుందని సినీ వర్గాల సమాచారం. దాదాపు జ‌రుగుతున్న ఈ షెడ్యూల్‌తో సినిమాను పూర్తి చేయాల‌ని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. అయితే, హీరోయిన్ ఇతర వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. యువి వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సన్నీ ఎంఆర్ సంగీతం అందించనున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికర వివరాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement