Sunday, April 28, 2024

తోబుట్టువులకు ఈ రోజు ప్రత్యేకం.. ఇండిగో

సోదర, సోదరీమణులకు ప్రత్యేకమైన పండగంటే రాఖీనే.. కానీ బిజీ ప్రపంచంలో ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్న ఎంతో మంది తోబుట్టువులు రాఖీ పండగను జరుపుకోలేకపోతున్నారు. అయితే ఇవ్వాల‌.. ఒక తోబుట్టువుల జంటకు విమానంలో పండుగ జరుపుకునే అవకాశం లభించింది. అవును ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ మెంబర్ అయిన శుభ, పైలట్‌గా ఉన్న తన సోదరుడు గౌరవ్ కు రాఖీ పండగను విమానంలో జరుపుకున్నారు. తన సోదరుడు కెప్టెన్‌ గౌరవ్‌కు రాఖీ కట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇండిగో తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది ‘ ఎంత ఎత్తులో ఉన్న తోబుట్టవులకు ఈ రోజు ప్రత్యేకం’ అని రాసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement