Monday, April 29, 2024

ప్రైమ్ డే సేల్ లో సరికొత్త‌ రికార్డ్.. సెకన్ కు ఐదు స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు

ప్రతీ సంవత్సరం ఈ కామ‌ర్స్ సంస్థ‌ ఆమెజాన్‌ ప్రైమ్ డే సేల్ ను ప్రకటిస్తుంటుంది. ఈ సేల్స్ లో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, హోం అప్లయన్సెస్, హౌజ్ హోల్డ్ ఐటమ్స్.. తదితర ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. అదే విధంగా ఈ నెల (జులై) 15 నుండి 16వ తేదీ వ‌ర‌కు ప్రైమ్ డే సేల్ ఏడవ ఎడిషన్ ను నిర్వహించింది. కాగా ఈ సారి జ‌రిగిన‌ ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో కొత్త రికార్డులు నమోదయ్యాయని పేర్కోంది కంపెనీ.

ఈ సేల్ సమయంలో కస్టమర్లు ప్రతీ సెకన్ కు సగటున ఐదు స్మార్ట్ ఫోన్స్ ను కొనుగోలు చేశారని ఆమెజాన్ వెల్లడించింది. అందులో కూడా, 70% సేల్స్ చిన్న నగరాలు, పట్టణాల నుంచే జరిగాయని పేర్కొంది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్, వన్ ప్లస్ నార్డ్ 3 5జీ, సామ్సంగ్ గెలాక్సీ ఎం 34, మోటొరోలా రేజర్ 40 సిరీస్, రియల్ మి నార్జొ 60 సిరీస్ వంటి కొత్తగా లాంచ్ అయిన‌ స్మార్ట్ ఫోన్స్, భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా అమ్ముడుపోయాయని తెలిపింది.

గత సంవత్సరం కన్నా 14% అధికంగా కస్టమర్లు ఈ ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్నారని తెలిపింది అమెజాన్. గ‌త ఏడాది (2022) ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్న కస్టమర్ల సంఖ్య కన్నా ఈ ఏడాది (2023) ప్రైమ్ డే సేల్ లో పాల్గొన్న కస్టమర్ల సంఖ్య 14% అధికమని ఆమెజాన్ ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement