Wednesday, May 8, 2024

Alert | తిరుమ‌ల దారిలో మరో చిరుత‌.. బోనులో చిక్కింది!

తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఇవ్వాల (గురువారం) ఉద‌యం ఓ చిరుత బోనులో చిక్కింది. తిరుపతి మెట్ల మార్గంలో గత శుక్రవారం లక్షిత అనే చిన్నారి చిరుత దాడిలో చ‌నిపోయింది. దీంతో, ఆ చిరుతను బంధించేందుకు అధికారులు దాడి జరిగిన పరిసరాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఆ మరుసటి రోజే ఓ చిరుత చిక్కింది. ఆ త‌ర్వాత ఇవ్వాల మరో చిరుత బోనులో చిక్కింది. తిరుమలలో చిరుతల సంచారం పెరిగింది. ఈ నేపథ్యంలో వాటిని పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద బోన్లను ఏర్పాటు చేశారు. దీంతో, ఇవ్వాల‌ తెల్లవారుజామున మరో చిరుత చిక్కిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

కాగా, మెట్లమార్గంలో భక్తులకు రక్షణగా కంచె ఏర్పాటు చేయాలన్న సూచన అమలు చేయడం కుదరదని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. చిరుతల స్వేచ్ఛా సంచారానికి కంచె ఏర్పాటుతో అడ్డంకి సృష్టించినట్టు అవుతుందని అంటున్నారు. చిరుతలన్నీ పెద్దవే కావడంతో కంచె‌ను దాటి కూడా అవి దాడి చేయగలవని హెచ్చ‌రిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement