Friday, May 3, 2024

కృష్ణా నదిపై వంతెన నిర్మించండి.. నారా లోకేష్ కు విన‌తి..

కర్నూలు : తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రారంభ‌మైంది. ఇందులో భాగంగా గురువారం నారా లోకేష్ రాయలసీమ కర్తవ్య దీక్ష కరపత్రాలను ఆవిష్కరించారు. అప్పర్ భద్ర ప్రాజెక్ట్ నిలుపుదల చేయాలని, కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ బదులు రోడ్ కమ్ బ్యారెజ్ నిర్మిస్తే రాయలసీమ రైతులకు న్యాయం జరుగుతుంద‌న్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ను రాయలసీమ ఉద్యమనాయకులు కలిసి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ విఎస్ సీమకృష్ణ, రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు నాగభూషణ్, రాము, సుధాకర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మ‌డి క‌ర్నూల్ లో నేటి యువగళం షెడ్యూల్…
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర నేటి నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొదలు కానుంది. రాయలసీమ లోని చిత్తూరు, అనంతపురం జిల్లాలో ఇప్పటి వరకు యువగళం యాత్రను నారా లోకేష్ కొనసాగించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 874.1 కిలోమీటర్ల దూరం నడిచారు.

ఇక ఉమ్మడి కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా 69వ రోజు యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఉదయం 7.00 గంటలకు తాడిపత్రి నియోజకవర్గం, రాయలచెరువు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. అనంతరం 7.45 చందన గ్రామంలో స్థానికులతో మాటామంతీ.
ఉదయం 9.50 గంటలకి దాయలమడుగులో మహిళలతో మాటామంతీ.
ఆ తర్వాత 10.00 – నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్రవేశం చేయనున్నారు.
అనంతరం ఉదయం 10.10 గంటలకి డి.రంగాపురంలో స్థానికులతో మాటామంతీ.
11.20 – నల్లమేకలపల్లి గ్రామస్తులతో సమావేశం.
11.50 – రాంపురం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
12.05 – జక్కసానికుంట్లలో ఎస్సీ సామాజికవర్గీయులతో ముఖాముఖి.
1.05 – జక్కసానికుంట్లలో భోజన విరామం.
సాయంత్రం
3.00 – జక్కసానికుంట్లలో యువతతో ముఖాముఖి.
4.00 – జక్కసానికుంట్ల నుంచి పాదయాత్ర ప్రారంభం.
5.00 – పిఆర్ పల్లి గ్రామస్తులతో మాటామంతీ.
6.40 – గుడిపాడులో విడిదికేంద్రంలో బస చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement