Thursday, April 25, 2024

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9.79 లక్షల ఉద్యోగ ఖాళీలు

కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల్లో భారీగా ఖాళీలున్నట్లు తెలిపింది. 2021 మార్చి 1 నాటికి కేంద్రంలోని 78 మంత్రిత్వశాఖలు, వివిధ విభాగాల్లో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటిలో అత్యధికంగా రైల్వేలో 2.93 లక్షల పోస్టులు ఉన్నట్లు నివేదించింది. తర్వాత ప్రాధాన్యతలో రక్షణశాఖ 2.64 లక్షలు, హోంశాఖ 1.43 లక్షల ఖాళీలను కలిగివున్నాయి. రాజ్యసభ ఎంపీ సుశీల్‌ కుమార్‌ మోడీ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు.

- Advertisement -

దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రోజ్‌గార్‌ మేళా ద్వారా వివిధ శాఖల్లోయువతకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏడాదిలోగా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా రోజ్‌గార్‌ మేళా ప్రణాళిక చేయబడిందని అన్నారు. జాతీయ రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీని ఏర్పాటు చేశామన్న ఆయన, ఉత్తమ పద్దతుల్ని అమలుచేసేందుకు కేంద్రం, రాష్ట్రాల్లో నియామక వ్యవస్థలపై సమగ్ర అధ్యయనం చేసినట్లు మంత్రి జితేంద్రసింగ్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement