Monday, April 29, 2024

షాపింగ్‌ మాల్‌లో కాల్పులు.. 8 మంది మృతి

డల్లాస్‌: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. డల్లాస్‌లోని ఓ షాపింగ్‌ మాల్‌లో గుర్తుతెలియని దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement