Wednesday, May 22, 2024

మూడో రోజు కొనసాగనున్న 5జీ వేలం.. రెండోరోజు 1.49 లక్షల కోట్లకు బిడ్లు

రెండో రోజు 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో టెలికమ్‌ కంపెనీలు 1,49,454 కోట్ల రూపాయిలకు బిడ్లు దాఖలు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. వేలం ప్రక్రియ మూడో రోజు గురువారం కూడా కొనసాగుతుందని ఆయన ప్రకటించారు. వేలంలో 700 మెగాహెడ్జ్‌తో పాటు దిగువ, మధ్య స్థాయి బాండ్స్‌కు కూడా మంచి స్పందన వచ్చిందిని ఆయన వెల్లడించారు. ఇప్పటికి వేలంలో 9 రౌండ్లు పూర్తి చేశారు.

వేలంలో ప్రధాన టెలికమ్‌ కంపెనీలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌ పాల్గొంటున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం వేలంలో అన్ని సంస్థల కంటే రిలయన్స్‌ ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా ప్రకారం రిలయన్స్‌ జియో 80,100 కోట్లకు బిడ్లు దాఖలు చేసి ఉండవచ్చు. రిలయన్స్‌ ఎక్కువా 10 మెగాహెడ్జ్‌లో ప్రిమియం 700 మెగాహెడ్జ్‌ బాండ్‌ కోసం పోటీ పడుతుంది . భారతీ ఎయిర్‌టెల్‌ 45,000 కోట్లకు బిడ్లు దాఖలు చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సంస్థ ప్రధానంగా 1800, 2100 మెగాహెడ్జ్‌ బాండ్స్‌ కొనుగోలుపై దృష్టి సారించే అవకాశం ఉందని ఐసిఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.

వోడాఫోన్‌ ఐడియా 18,400 కోట్లకు బిడ్లు వేసి ఉంటుందని తెలిపింది. అదానీ డేటా నెట్‌వర్క్స్‌ ప్రధానంగా 26 గిగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ కొనుగోలు పట్ల ఆసక్తి చూపిస్తోంది. అదానీ కంపెనీ 900 కోట్లకు బిడ్లు దాఖలు చేసి ఉంటుందని అంచనా వేసింది. 3350 మెగాహెడ్జ్‌ బాండ్‌ను ఈ సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మూడో రోజు వేలం తరువాత ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. స్పెక్ట్రమ్‌ వేలం ముగిసిన తరువాత ఆయా కంపెనీలకు వీటిని ఆగస్టు 14 కల్లా కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement