Sunday, April 28, 2024

చట్ట సభల్లో బీసీల‌కు 50 శాతం రిజర్వేషన్ : ఆర్ కృష్ణయ్య

ప్రజాస్వామ్యంలో ధనస్వామ్యం నడుస్తోందని, చట్ట సభల్లో 50 శాతం రిసర్వేషన్ పేట్టే వరకు ఉద్యమం చేస్తామని రాజ్యసభ ఎంపీ, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. మీడియాతో కృష్ట‌య్య మాట్లాడుతూ.. 56 శాతం ఉన్న వారికి వరుస అన్యాయం జరుగుతుంద‌ని, 14 శాతమే ఇప్పటివరకు బీసీలకు అవకాశాలు వచ్చాయని.. అవకాశం రానప్పుడు ప్రజాస్వామ్యం ఎలా అవుతుందన్నారు. దేశ సంపదలో బీసీల భాగస్వామ్యం ఎక్కువ కానీ.. రాజ్యాంగ పరంగా న్యాయమైన వాటా రావడంలేదన్నారు. బీసీ ప్రధాని ఉన్నారు కాబట్టి బీసీలు గట్టిగా కొట్లాడాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 3 చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామన్నారు. పార్లమెంట్ ముందు చేపట్టే ఈ ధర్నాని విజయవంతం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా బీసీలు తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement