Sunday, May 5, 2024

42మిలియ‌న్ల వ్యూస్ తో దూసుకుపోతున్న.. జింతాక్ సాంగ్

ధ‌మాకా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు మాస్ మహ‌రాజ్ ర‌వితేజ‌. ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ తో ‘ధమాకా’పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక రీసెంట్ విడుదైన ట్రైలర్ కూడా దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ లో రవితేజ మాస్ డైలాగ్ లు, పంచ్ లు, మేనరిజం, యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో సినిమా థియేటర్లలో దుమ్ములేపబోతుందని అర్థం అవుతోంది. రవితేజ – హీరోయిన్ శ్రీలీలా జంటగా నటిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ‘ధమాకా’ . త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కబోతోంది. సరిగ్గా ఐదు రోజుల్లో థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా సినిమా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అదిరిపోయే అప్డేట్స్ ను అందిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని అన్ని సాంగ్స్ ను విడుదల చేశారు.

భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ముఖ్యంగా మాస్ నెంబర్ గా విడుదలైన ‘జింతాక్ సాంగ్ కు మిలియన్ల వ్యూస్ దక్కుతున్నాయి. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. భీమ్స్ సిసిరోలియో, మంగ్లీ కలిసి పాడారు. ఆగస్టులో విడుదలైన ఈ పాట ప్రస్తుతం ఊపందుకుంది. యూట్యూబ్ లోనూ ట్రెండ్ అవుతోంది. ఇప్పటి వరకు 42 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకుంది. రవితేజ ఇటీవల సినిమాల్లో దీనికే ఎక్కువ దక్కడం విశేషం. మిగితా సాంగ్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి.ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. భీమ్స్ సిసిరోలియో అద్భుతమైన సంగీతం అందించారు. తనికెళ్ల భరణి, రావు రమేశ్, అలీ, హైపర్ ఆది, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. డిసెంబర్ 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement