Friday, May 3, 2024

తెలంగాణ లో టెస్టులు పెరగలేదు…కేసులు పెరగలేదు!! కొత్తగా 4298 కేసులు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,298 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే మరోవైపు 32మంది కరోనాతో మృతి చెందారు. మరోవైపు కరోనా నుంచి 6,026 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.55శాతంగా నమోదవ్వగా.. రికవరీ
రేటు 89.33శాతంగా ఉంది.

అయితే గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 64,362 టెస్టులు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గడచిన 24 గంటలలో 601 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం గ్రేటర్ లో 1,20,398 కరోనా కేసులు నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement