Saturday, April 20, 2024

పుష్ప ఫస్ట్ పార్ట్ బ్యాలెన్స్ ఇదే !!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్పమ్ గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ చిత్రంగా రెండు పార్ట్ లుగా రాబోతుంది.

అయితే లేటెస్ట్ గా మొదటి పార్ట్ కు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు సహా ఓ పాట బ్యాలెన్స్ ఉందట. ఇవి కాస్త అయిపోతే రెండో పార్ట్ లో ఉన్న బ్యాలెన్స్ షూట్ ను పూర్తి చేస్తారట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా…. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement