Sunday, April 28, 2024

తెలంగాణ లో కొత్తగా 3837 కరోనా కేసులు…మరణాలు ఎన్నో తెలుసా ?

తెలంగాణ లో కరోనా తీవ్రత అలాగే ఉంది. గడిచిన 24 గంట‌లలో మొత్తం 71,070 టెస్ట్ లు చేయగా 3,837 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. అలాగే క‌రోనా కార‌ణంగా మ‌రో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 4,976 మంది గడిచిన 24 గంటల్లో కొలుకున్నారు.

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రం లో మొత్తం 5.40 ల‌క్ష‌లకు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.అలాగే 4.90 ల‌క్ష‌ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 46,946 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 594, రంగారెడ్డి లో 265, మేడ్చ‌ల్ 239, ఖ‌మ్మం జిల్లాలో 227 కేసులు నమోదు అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement