Sunday, April 28, 2024

National: 18ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌… శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాప‌న‌..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ పరిధిలోని ఐంచోడ కాంబోహ్‌లోని శ్రీ కల్కి ధామ్ ఆలయానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేయడం తనకు దక్కిన వరమని, ఈ ఆలయం భారతీయుల విశ్వాసానికి మరో కేంద్రంగా అవతరిస్తుందని అ‍న్నారు.

ఇక్కడి ప్రజల 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల్కి ధామ్‌కు శంకుస్థాపన చేసే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. తన కోసమే కొందరు మంచి పనులు వదిలి వెళ్లారని, భవిష్యత్తులో ఏ మంచి పని మిగిలిపోయినా మహనీయులు, ప్రజల ఆశీస్సులతో వాటిని పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి అని, ఈ రోజు మరింత పవిత్రమైనదని, ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా మారుతుందని అన్నారు.

- Advertisement -

ఒకవైపు దేశంలోని యాత్రా స్థలాలను అభివృద్ధి చేస్తూనే, మరోవైపు నగరాల్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పిస్తున్నామని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారీ స్థాయిలో నిర్మితం కాబోతున్న ఈ కల్కిధామ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనున్నదని, గర్భాలయంలో దశావతారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ నేడు భారతదేశ వారసత్వ సంపద ప్రపంచ వేదికపై గుర్తింపు పొందుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement