Friday, May 17, 2024

తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది: కేసీఆర్ కు మంత్రి హరీష్ జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి హరీష్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ లో తెలంగాణ సాకారం అయ్యిందంటే అందుకు కేసీఆర్ కారణమని పేర్కొన్నారు. భావి తరాల బంగారు తెలంగాణ  కేసీఆర్ వల్లే సాధ్యమౌతుందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రగతి పథంలో దూసుకుపోతూ, గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లి విరుస్తోందని హరీష్ ఆ  ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement