Friday, May 3, 2024

గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు

గుంటూరు అర్బన్ ఎస్పీగా రిహాన్ అనే చిన్నారి బాధ్యతలు నిర్వర్తించాడు. రిహాన్ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కాగా ఆ చిన్నారికి పోలీసులు కావాలనే కోరిక ఉండేది. ఈ క్రమంలో ఆ బాలుడి కోరిక మేరకు కొద్ది సేపు అర్బన్ పోలీసుగా బాధ్యతలు నిర్వహించాడు. అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి స్వయంగా ఆ బాలుడిని తన ఛాంబర్‌లో కూర్చోపెట్టారు. బాలుడితో పాటు తలిదండ్రులు నోయెల్ చాంద్, బీబీ నూర్జహాన్ కూడా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తన కోరిక నెరవేరినందుకు ఆ చిన్నారి చాలా సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది. తమ చిన్నారి ముఖంలో నవ్వులు చూసి వారి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement