Friday, April 26, 2024

ఎడిటోరియ‌ల్ – అటు విందు – ఇటు విద్రోహం..

బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ భారతీయ సంప్రదా యాలను గౌరవిస్తూ ఈనెల17వతేదీన లండన్‌లో మకర సంక్రాంతి ఉత్తరాయణం ప్రవేశం సందర్భంగా తన కార్యాలయంలో వారికి,దౌత్యవేత్తలకూ అరిటాకుల్లో భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. యూర ప్‌లో భారతీయుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ విందుకు వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులను ఆహ్వానించారు.రిషి సునాక్‌ బ్రిటన్‌లో స్థిరపడిన భార తీయ కుటుంబానికి చెందిన వారు. కాగా, ఆయన ఇన్‌ఫో సిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి అల్లు డన్న సంగతి తెలిసిందే. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పెక్కు సవాళ్ళను ఎదుర్కొం టున్నారు. వాటి లో ఖలిస్తాన్‌ వాదుల దాడులు ముఖ్యమైనవి.కెనడా కేం ద్రంగా ఖలిస్తాన్‌ వాదులు తమ కార్యకలాపాలను వివిధ దేశాల్లో విస్తరింపజేస్తున్నారు.ఆస్ట్రేలియాలో ఇటీవల హిందూ ఆలయాలను ధ్వంసం చేశారు.ఈ విష యమై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బేన్స్‌ ఇటీవల ఢిల్లిd సంద ర్శించినప్పుడు ఆయన దృష్టికి మన ప్రధాని నరేం ద్రమోడీతెచ్చారు.ఆయనఈ విషయమై త గిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కెనడా ప్రభుత్వంతో కూ డా మన ప్రభుత్వం ఈ విషయమై సంప్రదింపులు జరు పుతోంది.ఖలిస్తాన్‌ ఉద్యమం 80వ దశకంలో ఎక్కువగా ఉన్న మాట నిజమే అయినా, ఇప్పుడు ఎక్కడా లేదు. తల్లివేరు నుంచి పిల్లవేరు పుట్టుకొచ్చినట్టు ఆ ఉద్యమ ప్రభావంతో ఎదిగిన అమృతపాల్‌ సింగ్‌ పంజాబ్‌లో అల జడి సృష్టిస్తున్నారు.ఇటీవల తన అనుచరుణ్ణి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అమృతసర్‌ సమీపంలోని ఒ క పోలీసు స్టేషన్‌ వద్ద సాయుధులైన వేలాది మందితో పెద్ద ప్రదర్శన నిర్వహించారు.ఆ ప్రదర్శన సందర్భంగా అత డి అనుచరులు తుపాకులు,కృపాణాలు ఎక్కు పెట్టినా, పోలీ సులు సంయమనంతో వ్యవహరించడం వల్ల ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అమృ తపాల్‌ సింగ్‌ కోసం పోలీసులు వందకార్లతో వెం టాడి నప్పటికీ అతడు దొరికినట్టే దొరికి పారిపోయా డు.అతడు నేపాల్‌ మీదుగా కెనడా పారిపోయేందుకు ప్రయత్ని స్తున్నట్టు పోలీసులకు స్పష్టమైన సమాచారం అందింది. పోలీ సుల్లో అతడి ఏజెంట్లు ఉన్నారు. పోలీ సులు వెంటా డుతున్నప్పుడు పంజాబ్‌లోని మోగా జిల్లాలో అతడు మరో కారు ఎక్కి పోలీసుల కన్నుగప్పి పారిపో యాడు. అతడి కోసం పంజాబ్‌లో ఇంటర్‌నెట్‌ని నిలిపి వేసి రాష్ట్రా న్ని అష్ట దిగ్బంధనం చేశారు.

లండన్‌లో భార తీయ పతాకాన్ని దించి వేయడంలో భారత కాన్స్యులేట్‌ అధికా రుల ప్రమేయం ఉందని భావిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తున్నారు. భారత పతాకాన్ని అవ మా నించడం ద్వారా సునాక్‌ ప్రతిష్టను దెబ్బతీ యడమే ఖలిస్తాన్‌ వాదుల యత్నంగా కనిపిస్తోంది. ఖలిస్తాన్‌ వాదులు మన దేశంలోని పంజాబ్‌లోనూ, సరిహద్దు ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్ని స్తున్నారు. అతడికి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి. ముఖ్యం గా ఐఎస్‌ఐ నుంచి భారీగా నిధులు వస్తున్నట్టు సమా చారం.లండన్‌లో భారీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ భారత దౌత్య కార్యాలయంలో భారత పతాకాన్ని లాగి చించివేశారంటే ఖలిస్తాన్‌ వాదులకు వివిధ స్థాయిల్లో మద్దతుదారులు ఎంత మంది ఉన్నారో స్పష్టం అవు తోంది. అమృతపాల్‌ సింగ్‌ అనుచరులు ఐదుగురిని అరెస్టు చేసినట్టు పంజాబ్‌ డిజిపి తెలిపారు.పంజాబ్‌లో అధికారం చేతులు మారిన తర్వాత ఖలిస్తాన్‌ వాదులు చెలరేగుతున్నారు.వారికి స్థానిక రాజకీయ నాయకుల ప్రాపకం లభిస్తోంది.అకాలీదళ్‌ హయాంలో డ్రగ్స్‌ స్మగ్లిం గ్‌లో తోడ్పాటునందించిన మాజీఉప ముఖ్యమంత్రి సుఖబీర్‌ సింగ్‌ బావమరిది ఈ వ్యాపారం ఒక సారి అరెస్టు అయ్యాడు.ఇప్పటికీ డ్రగ్స్‌ స్మగ్లర్ల ముఠాలకూ,ఖలిస్తాన్‌ నాయకులకు సంబంధాలున్నాయి. భారత ప్ర భుత్వం తమపై ఉక్కుపాదం మోపుతుండటంతో ఖలిస్తాన్‌ వా దులు ఇతర దేశాల్లో ప్రవాస భారతీయులను ఇబ్బం దులకు గురి చేస్తున్నారు. దానిలో భాగంగానే పంజాబ్‌లో తాజాగా రెచ్చిపోతున్నారు. మరో వంక బ్రిటిష్‌ ప్రధాని సునాక్‌ని దెబ్బతీయడానికి ఒక్క ఖలిస్తాన్‌ వాదులే కాకుండా, బ్రిటన్‌లోని మాజీ పాలకులు,ఇతర పార్టీలకు చెందిన వారు ప్రయత్నిస్తున్నారు. ఆయన తీసుకు వస్తున్న సంస్కరణలు వారికి ఇబ్బంది కలిగిస్తుండటమే ఇందుకు కారణం.పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ని సందర్శించే సిక్కు యాత్రికుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ కారిడార్‌ని ప్రారంభించిన తర్వాత ఆ యాత్రికులతో పాటు ఖలిస్తాన్‌ తీవ్రవాదులు దానిని బాగా ఉపయోగించుకుంటున్నారు.ఖలిస్తాన్‌ తీవ్రవా దులకూ, ఐఎస్‌ఐ తీవ్రవాదులకూ మధ్య ఇప్పటికీ సంబం ధాలు కొనసాగుతున్నాయి. నల్లమందుకు,మాదక ద్ర వ్యాల అక్రమ రవాణా ద్వారా నిధులకు కొరత లేకుండా చూస ు కుంటున్నారు.అమృతపాల్‌ సింగ్‌ ఎదుగుదలకు దోహ దం చేస్తున్న అంశాల్లో మాదక ద్రవ్యాల వ్యాపారం ఒకటి.మాదక ద్రవ్యాల వ్యాపారంపై కేంద్రం ఉక్కుపాదం మోపడంతో అమృతపాల్‌ సింగ్‌ వర్గీయులు విజృంభిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement