Thursday, March 28, 2024

చైల్డ్‌ కేర్‌ లీవ్ ను స‌ర్వీస్ లో ఎప్పుడైనా వాడుకునే స‌దుపాయం క‌ల్పించిన జ‌గ‌న్

అమరావతి,ఆంధ్రప్రభ: శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ను నూతనంగా ఎంపి-కై-న ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంవి రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కలిశారు. ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డితో కలిసి ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంకు విజ్ఞాపన పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను… పిల్లలు 18 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు మాత్రమే వాడుకోవాలన్న నిబంధనను తొలగించాలని సీఎంను కోరారు. ఎమ్మెల్సీల విజ్ఞప్తిపై స్పందిస్తూ.. ఈ నిబంధనను మార్పు చేస్తూ… సర్వీసు కాలంలో ఎప్పుడైనా 180 రోజుల చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను మహిళా ఉద్యోగులు వాడుకునే వెసులుబాటు- కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ప్రైవేటు- స్కూళ్ల రెన్యువల్‌ ఆఫ్‌ రికగ్నైజేషన్‌ను మూడు సంవత్సరాల నుంచి ఎనిమిది సంవత్సరాలకు పెంచాలని కూడా ఎమ్మెల్సీలు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం, ఈ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement