Friday, May 3, 2024

ఆర్‌ఆర్‌ఆర్‌ డిజిటల్‌ రైట్స్‌ రికార్డ్‌ ధర…?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌…భారీ బడ్జెట్‌తో అసలైన పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీపై దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. రాజమౌళి కూడా ఈమూవీపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడు. ముఖ్యంగా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే ప్రతిసీన్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉండబోతున్నయని టాక్‌. సినిమాలో ప్రతి సీన్‌ను ఓ కావ్యంలా చెక్కుతున్నాడు జక్కన్న. అంతేకాదు ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టరే ఆర్‌ఆర్‌ఆర్‌ సెట్లో ఫైట్లు కంపోజ్‌ చేస్తున్నాడట. ఇక ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ కి భారీ బిజినెస్‌ అయినట్లు తెలుస్తోంది. ఏకంగా 200 కోట్లకు స్టార్‌ నెట్‌వర్క్‌ ఈ హక్కులను సొంతం చేసుకున్నట్లు రూమర్లు బయటకొచ్చాయి. ఇదే గనక నిజమయితే రికార్డ్‌ ధర పలికినట్లువుతుంది. ఇప్పటివరకు ఇండియన్‌ మూవీలో ఏ సినిమాకు డిజిటల్‌ రైట్స్‌ రూపంలో ఇంత మొత్తం పలకలేదు. త్వరలోనే మూవీకి సంబంధించి అప్‌డేట్స్‌ బయటకు రానున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ అక్టోబర్‌ 13 న విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement