Wednesday, December 11, 2024

న్యూఢిల్లీ : పెట్రో ధరలపై పన్ను తగ్గింపు!?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహావేశాలను, మోడీ సర్కార్ ప్రబలుతున్న వ్యతిరేకతను తగ్గించే చర్యలకు మోడీ సర్కార్ ఉపక్రమిస్తున్నది. ఓ వైపు పెట్రో ధరలు, మరోవైపు గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం నష్ట నివారణ చర్యలకు సిద్ధపడుతున్నది. వినియోగదారులకు ఒకింత ఊరట కలిగించే యోచనలో కేంద్రం ఉన్నట్టు ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే వర్గాల భోగట్టా. పన్నులు తగ్గించడానికి ముందు ఆయిల్‌ ధరలు నిలకడగా ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. క్రూడాయిల్‌ ధరలు పెరిగినా తిరిగి పన్ను స్టక్చర్‌ మార్చనవసరం లేకుండా చూసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement