Friday, March 29, 2024

నానికి విలన్ గా బెంగాలీ నటుడు..

శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రంలో హీరో నాని. ఈ చిత్రంలో విలన్ ఫిక్స్ అయ్యాడు. కలకత్తా నేపథ్యంలో పీరియడిక్ సినిమాగా తెరకెక్కుతోంది.  ఈ సినిమాలో విలన్ పాత్రకోసం ప్రముఖ బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను లైన్ లో పెట్టింది బృందం. ఇప్పుడిప్పుడే జిషు తెలుగులో వరుస అవకాశలు అందుకుంటున్నాడు. నందమూరి బాలకృష్ణ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో ఈయన ఎల్వి ప్రసాద్ పాత్ర పోషించాడు. ఆ సినిమా తర్వాత ‘అశ్వథ్థామ’తో మెయిన్ విలన్గా నటించి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ‘భీష్మ’ సినిమాలో కామెడీ విలన్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తాజాగా నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఓకే అయినట్లు శ్యామ్ సింగరాయ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. చూస్తుంటే ఈ సినిమాలో జిషు సేన్ గుప్తా రఫ్ లుక్కులో కనిపిస్తాడని టాక్. ఈ స్టైలిష్ బెంగాలీ హీరో.. అటు బెంగాలీ భాషతో పాటు హిందీ తెలుగు భాషలలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ తో పాటు మెగాస్టార్ ఆచార్యలో కూడా విలన్ రోల్ చేస్తాడని చాలా వార్తలొచ్చాయి. కానీ ఆ విషయం ఇంకా ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా.. శ్యామ్ సింగరాయ్ లో నాని సరసన సాయిపల్లవి కృతిశెట్టి మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం జిషును ఆహ్వానిస్తూ నిర్మాణసంస్థ పోస్ట్ పెట్టింది. వెంకట్ బోయినపల్లి సినిమా నిర్మిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement