Saturday, April 20, 2024

Editorial : ఆపరేషన్‌ గరుడ.. ఇంకా చాలా ఛేదించాలి!

విశాఖ తీరంలో ఆపరేషన్‌ గరుడ…ఒళ్ళు గగు ర్పొడిచే ఒక వైపరీత్య వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. మిల్లి గ్రాములు..గ్రాములు పోయి కిలోలు… అందునా ఏకంగా పాతిక వేల కిలోలు! జేబుల్లో… చిన్నచిన్న సంచుల్లో, గోతాల్లో రవాణా చేసే స్థితి నుంచి ఏకంగా ఒ క భారీ కంటైనర్‌లో విదేశాల నుంచి దిగిన కొకైన్‌ పట్టుబడింది.

- Advertisement -

అందులో ఒక్కొక్కటి 25 కేజీల చొప్పున వెయ్యి బ్యాగులు ఉన్నాయి. అయితే అది అలా పట్టుబడకుండా నిగూఢంగా అక్రమ మార్గాల ద్వారా జనాన్ని చేరి ఉంటే… కొన్ని దశాబ్దాల పాటు భావితరాల భవిష్యత్తు అంధకార బంధురమై ఉండేది. ఈ విషయంలో సీబీఐని మెచ్చుకోకుండా ఉండలేము. మాదకద్రవ్యాల సమస్య ఎంత తీవ్రస్థాయిలో ఉన్నదో, అది ఎంతటి పెనుభూతమై సమాజంలో వ్యాపించి ఉన్నదో కళ్లకు కట్టినట్టుగా చూపించిన ఘటన ఇది. కొకైన్‌ కంటైనర్‌ కాకినాడ జిల్లా యు.కొత్త పల్లిలో ఉన్న ఒక ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ చిరునామాకు వచ్చింది. అది ఎవరిదో కూపీలాగే పనిలో సీబీఐ అధికారులు ఉన్నారు. వారు చేయాల్సిన పనులను వారు చేస్తారు. దర్యాప్తులు, కేసులు, అరెస్టులు వగైరా జరుగుతాయి. కానీ అసలైన నేరస్తులు పట్టుబడతారా, వీటి దిగుమ తులను పూర్తిగా ఆపుతారా, అంత సరుకు ఇక్కడ ఎన్ని రకాలుగా ఎన్నివిధాలుగా వినియోగదారులకు చేరుతున్నదో పోలీసులు తెలుసుకోగలు గుతారా…ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే.

ఎందుకంటే మాద క ద్రవ్యాల విషయంలో వినియోగించేవారి పేర్లు వెల్లడి అయినట్టుగా వీటిని మార్కెట్‌ చేస్తున్నవారి పేర్లు వెల్లడి కాకపోవటం మనం గమనిస్తున్నాం.ఎన్నికల వేళ సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడటమే చూస్తుంటాం. కానీ ఇది అనుకో కుండా ఎదురైన అవాంఛనీయ ఘటన. ఇంతస్థాయిలో మాదక ద్రవ్యాలను అమ్మగల మార్కెట్‌ ఇక్కడ ఉన్నదా… అన్న అంశమే పోలీసులనే కాదు, సమాజం లోని అన్ని వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. అటు అంతర్జాతీయ నేర సామ్రాజ్యం తెలుగునేలపైన ఇంతగా విస్తరించడం, ఇటు అంతస్థాయిలో నార్కోటెక్స్‌ మాద క ద్రవ్యాలను అమ్మగల మార్కెట్‌ ఇక్కడ ఉండటం… ఈ రెండూ అత్యంత అవాంఛనీయమైన, ఆందోళనని కలిగించే అంశాలే. డ్రగ్‌ డిటెక్టివ్‌ కిట్‌తో పరిశీలించి నప్పుడు అదంతా కొకైన్‌ అని తేలింది. అయితే దీనిని దిగుమతి చేసుకున్నసంస్థ తాలూకూ ప్రతినిధి ఈ అంశం గురించి మాట్లాడుతూ… తాము ఈ ‘ఐటమ్‌’ ని దిగుమతి చేసు కోవటం మొదటిసారని, ఇందులో ఉండే సమ్మేళనాలు తమకు తెలియదని చెప్పాడు.

తెలుగు రాష్ట్రాల్లో మాదకద్రవ్యాల వాడకం, అది అందుబాటులోకి వస్తున్న మార్గాలపై తరచుగా వార్తలు వస్తున్నాయి. గంజాయిని వక్కపొడి ప్యాకెట్ల సైజులో నింపి కిరాణా దుకాణాల్లో, పాన్‌ డబ్బా దుకాణాల్లో గుట్టుగా విక్రయిస్తున్నారని తెలుస్తోంది. అంత దగ్గరగా ఇళ్లకు, కాలేజీలకు చేరువగా మాదకద్రవ్యాలు వచ్చే శాయి. కాలేజీ విద్యార్థినీ విద్యార్ధులు వీటిని కొనుగోలు చేసి వాడుతున్నారని తెలిసినప్పుడు ఆశ్చర్యపో యాము. తాజాగా ఇప్పుడు పదవ తరగతి విద్యార్ధినీ విద్యార్ధులు కూడా గంజాయి వాడకానికి అలవాటు పడినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. తెెలంగాణా లోని జగిత్యా లలో ఒక విద్యార్ధిని వింత ప్రవర్తనకు షాక్‌ తిన్న పోలీసులు దర్యాప్తు జరపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒడిషా సరిహద్దు లలో, విశాఖ మన్యంలోనూ గంజాయి మొక్కల పెంపకం అడ్డూ అదుపు లేకుండా సాగుతోందన్న వార్తలు రోజూ వస్తు న్నాయి. విశాఖ, వరంగల్‌ మీదుగా గంజాయి రవా ణా నిరంతరం సాగుతోంది. గంజాయి ప్యాకెట్లను, బంగీలను పోలీసులు పట్టుకుంటున్నారు.

విదేశాల్లో ఉపయోగించే మాదక ద్రవ్యాలు ఖరీదైనవి. వాటిని కొనలేని వారు గంజాయికి బానిసలవుతున్నారు. గంజా యి మొక్కల పెంపకం, రవాణా అంతా వ్యవస్థీకృతంగా సాగుతోంది. ఇందులో పోలీసులు, అధికార యంత్రాం గం, రాజకీయ నాయ కుల పాత్ర ఉన్నట్టు తరచూ ఆరోప ణలు వసు ్తన్నాయి. మాదక ద్రవ్యాలను వినియో గించే వారు సెెలబ్రిటీలు అయినప్పుడు మాత్రమే వీటి తాలూ కూ హడావుడి, ప్రజల్లో కుతూహలం కనబడుతు న్నాయి. అయితే ఇప్పుడు పట్టుబడిన డ్రగ్‌ పరిమా ణాన్ని చూస్తే… ప్రతి ఇల్లు ఆందోళన చెందాల్సిన సంద ర్భం. అలాగే ప్రతి తల్లిదండ్రులు ఈ మహమ్మారి ఎక్కడి వరకు వచ్చేసిందోననే భయాన్ని, సందిగ్దాన్ని తీర్చు కు ని, తమ పిల్లలు సురక్షితంగానే ఉన్నారని తెల్చుకుని ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి. పోలీసులు మాత్రమే సీరియస్‌ గా తీసుకుని వారి విధులను నిర్వర్తించినంత మాత్రాన ఈ ఉపద్రవం తొలగుతుందని చెప్పలేము.

Advertisement

తాజా వార్తలు

Advertisement