Friday, May 3, 2024

Editorial – కొంగ్రొత్త ఆశ‌ల‌తో…

కాలం గిర్రున తిరుగుతుంది.కాలంతో మనం పరుగె త్తలేం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతు ల్లోనే ఉంది.సవాళ్ళను అధిగమించి కొంగ్రొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని కోరుకుందాం, అందరిలో మం చిచూడాలి, అందరితో మంచిగా మాట్లా డాలన్న మహాత్మాగాంధీ సూక్తులను అందరూ మననం చేసుకుని ముందుకుసాగితే అంతా మంచే జరుగుతుంది. పాత సంవత్సరం వెళ్ళిపోయి, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేటప్పుడు మనమంతా తీసుకోవల్సిన ప్రతిన ఇది. పాత సంవత్సరంలో కొన్ని చేదు ఘటనలు చోటు చేసుకున్నా, అందరికీ ఆనందాన్ని ఇచ్చే ఘటనలకు నాంది ప్రస్తావన జరిగింది. అనంతమైన కాలంలో, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పొందిన గడిచిన ఏడున్నర దశాబ్దాల్లో మనం సాధించింది అల్పమేమీ కాదు. ఎంతో సాధించామని సంతృప్తి చెందకుండా, ఇంకా సాధించా ల్సింది ఉందన్న ఆశయంతో ముందుకు సాగాలి. ఇందు కు సత్సంకల్పం, చిత్తశుద్ధి, దృఢదీక్ష, పట్టుదల అవసరం. ఆ దిశగానే మన దేశం, మన దేశ నాయకత్వం పయని స్తోంది. ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ రెండు విడతల పదవీ కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి మూడో విడత లో కూడా ప్రధానిగా ఈ దేశానికి సేవలందించేందుకు, హ్యాట్రిక్‌ సాధించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్థికంగా మరో మూడేళ్ళలో ప్రపంచంలో తిరుగులేని తృతీయ శక్తిగా మన దేశం రూపుదిద్దుకోనున్నది. ఆహారధాన్యాల స్వయం పోషకత్వ దశను దాటుకుని ముందుకు సాగు తోంది. జాబిలితో ముద్దాడేందుకు రాకెట్లను పంపిస్తోంది.

సరిగ్గా నూతన సంవత్సరంనాడే భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ఎక్స్‌పో శాట్‌ని విజయవంతం గా ప్రయోగించింది. మనం దైవంగా ఆరాధించే ఆదిత్యు ని వద్దకు ఇస్రో పంపిన రాకెట్‌ కొద్ది రోజుల్లో లక్ష్యాన్ని సాధించనున్నది. విద్యుత్‌ రంగంలో మన దేశం మేలి కాంతులతో మిలమిలా మెరిసిపోతోంది. దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయడానికి ఏర్పాట్లను పూర్తి చేశారు.దేశంలో శాంతిభద్రతలు గతంలో కన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయి. కాశ్మీర్‌కి ప్రత్యేక రాజ్యాంగం, పతాకం, ప్రత్యేక పాలకుడు గత కాలపు అంశం అయ్యాుం. కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో తొలిసారిగా లాల్‌చౌక్‌ వద్ద జాతీయ జెండా రెపరెపలా డింది. కాశ్మీర్‌ భారత్‌ అంతర్భాగమనడానికి ఇంతకన్నా సంకేతం ఇంకేం కావాలి. ఆక్రమిత కాశ్మీర్‌ని కూడా మన దేశంలో విలీనం చేయడానికి పాల కులు పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం మన వైపు ఎదురు చూసే స్థాయికి మన దేశం ఎదిగింది.మానవాళి మను గడను సవాల్‌ చేస్తున్న కరోనాకి విరుగుడుగా మన శాస్త్రజ్ఞులు వ్యాక్సిన్‌ని కనిపెట్టారు. దేశంలో ప్రజలందరికీ వ్యాక్సినేషన్‌ చేయడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు వ్యాక్సిన్‌ని సరఫరా చేసి అందరి ప్రశంస లను అందుకుంది మన దేశం.ప్రపంచ శాంతికి ఆనా డూ, నేడూ కూడా మన దేశం మధ్యవర్తిత్వం వహిస్తూనే ఉంది.

ఉక్రెయిన్‌- రష్యాయుద్ధాన్నీ, ఇజ్రాయెల్‌- హమా స్‌ యుద్ధాన్నీ విరమింపజేసేందుకు భారత్‌ మధ్యవర్తి త్వాన్ని వహించాలని పలు దేశాలు కోరుతున్నాయి. మన సైనిక దళాల శక్తి సామర్ధ్యాలను పొరుగుదేశాలే కాకుండా ఇతరదేశాలు గుర్తించాయి. భారత్‌ నుంచి శాంతి దళాల ను పంపాలని కోరుతున్నాయి. ఆంతర్గతంగా మన దేశం అనేక జటిల సమస్యలను పరిష్కరించకుంటూ ముందు కు సాగుతోంది. ముఖ్యంగా, దశాబ్దాల పాటు దేశాన్ని కుదిపేసిన అయోధ్యలో రామాలయం సమస్య పరిష్కా రం కావడమే కాకుండా కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా రామాలయం ఈనెల 22వ తేదీన ప్రారంభో త్సవానికి సిద్ధమవుతోంది. అయోధ్య రైల్వేస్టేషన్‌, అయోధ్య విమానాశ్రయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత వారంప్రారంభించారు. రామాలయంలో విగ్రహాల ప్రాణప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ప్రతిపౌరుడు దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాల ని ప్రధాని పిలుపు ఇచ్చారు.

కొత్త సంవత్సరంలో అనేక సంబరాలను మోసుకొచ్చింది. అదే సందర్భం అనేక సవాళ్ళను దేశం ముందు ఉంచింది. రెండుమూడు నెల ల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలు దేశ ప్రజల విజ్ఞతకు మనో బలానికి పరీక్ష కానున్నాయి. కొత్త సంవ త్సరంలోకి అడుగు పెట్టే సమయంలోనే ఎన్నికల వాతావరణం దేశ మంతటా పరుచుకుంది. ప్రజల్లో సమైక్య భావం వెల్లివిరి సేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రతిఫలిస్తు న్నాయి. కొత్త సంవత్సరంలో అవి మరింత స్పష్టతను సంతరించుకోవచ్చు. కొత్త సంవత్సర ఆరంభంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా, ప్రశాంతంగా జరగడం ముదావహం. యావత్‌ ప్రపంచం సంక్షుభిత వాతావర ణంతో సతమతమవుతున్న వేళ భారత్‌ భిన్న త్వంలో ఏకత్వ సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. అదే మనకు శ్రీరామరక్ష.

Advertisement

తాజా వార్తలు

Advertisement