Wednesday, May 1, 2024

Editorial – విభిన్నం … విశేషం…

ఎర్రకోటపై పదోసారి ప్రధాని మోడీ జాతీయ పతాకా విష్కరణ… గతంలో మిగతా తొమ్మిది సందర్భాలకు పూర్తి భిన్నమైన కంఠస్వరాన్ని విన్పించింది. మువ్వన్నెల పతాకం ఎగురవేసిన అనంతరం ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ఈసారి కాస్త విభిన్నతకు, సహజ ధోరణిలో మార్పునకు అద్దంపట్టింది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్ని కలు జరగనున్న నేపథ్యంలో కొత్త పథకాల ప్రస్తావన, తన ప్రభుత్వం సాధించిన ఘన విజయాల ఉటంకింపు, హావభావ విన్యాసాలు, ఆహా ర్యం, వాక్చాతుర్యం, ఇంపై న పదబంధాలతో సాగిన మోడీ ప్రసంగ ప్రవాహ ఝరిలో కొన్ని సందర్భాలలో ఆచితూచి మాట్లాడటం కొట్టొచ్చినట్టు కన్పించింది. ప్రజలను సంబోధించే విషయం నుంచి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అంశంలో వాడిన పదజాలంలో జాగ్రత్త, ఆత్మవిశ్వాసం లో మార్పు కనిపించాయి. ఇప్పటివరకు పదిసార్లు ఆయన ఎర్రకోటపై జాతినుద్దే శించి ప్రసంగించారు. ఆ ప్రసంగాలన్నీ ఒక ఎత్తు.. ఈసారి ప్రసంగం మరో ఎత్తు. మణిపూర్‌ అంశంపై మాట్లాడండి అంటూ దేశం యావ త్తు, విపక్షాలు గొంతు చించుకున్నా చలించక పార్లమెం ట్‌లో మొక్కుబడి ప్రస్తావనతో సరిపెట్టిన ప్రధాని.. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాత్రం మణి పూర్‌కు భరోసా ఇచ్చేట్టు మాట్లాడటం ఓ మార్పే.

సహజంగా ప్రధానమంత్రి రోజూ ఏదో అంశంపై మా ట్లాడుతూ ఉంటారు. విధానాలు.. వివాదాలు.. విజయా ల ప్రస్తావన ఉంటుంది. కానీ, స్వాతంత్య్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లిdలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకా న్ని ఆవిష్కరించిన తర్వాత చేసే ప్రసంగానికి ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. మిగతా ప్రధానులకు భిన్నంగా నరేంద్రమోడీ తమ ప్రసంగాల్లో ఆత్మవిశ్వాసాన్నీ, అతి శయాన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. మోడీ ఇదే ఎర్రకోటపై పదేళ్ళ నుంచి జాతీయ జెండాని ఎగురేస్తున్నారు. మరో ఐదేళ్ళపాటు తనకు ఢోకా లేదనీ, తన చేతుల మీదుగానే త్రివర్ణపతాకం ఆవిష్కరణ జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు. ఇటీవల పార్లమెం టులో అవిశ్వాసం తీర్మానం పై విపక్షాల విమర్శలకు సమాధానం చెబుతూ, విప క్షంపై దునుమాడిన మోడీ వచ్చే ఎన్నికల్లో విజయదుం దుభి మోగిస్తామని తిరుగు లేని విశ్వాసం వ్యక్తం చేశారు.కానీ ఎర్రకోటపై ప్రసంగం లో ఆ విశ్వాసం సడ లినట్లు ఆయన మాటల్లో ద్యోతక మైంది. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామని చెబుతూనే… ప్రజల ఆశీస్సులుంటే… అని ఓ పొడిమాట అనడం ఆశ్చర్యపరుస్తోంది. వారం రోజుల క్రితమే ఎంతో ధీమాగా చెప్పిన నాయకుడు ప్రజల మద్దతు ఉంటేనే అధికారంలోకి వస్తామని ఇప్పుడు అన డంలో ఆంతర్యం ఏమిటి? అని విశ్లేషకులు పరిపరి విధా ల ఆలోచించడం మొదలు పెట్టా రు. ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమిని ఏర్పాటు చేయడం వల్ల తనకు నష్టమేమీ ఉండదనే ధీమా ఉన్నా.. ప్రజల మద్దతు అవసరమన్న విషయాన్ని మోడీ అన్యాపదేశంగా ఒప్పుకోవడం విశేషమే. మణిపూర్‌ ఉదంతాలపై సుదీర్ఘకాలం మౌనం వహించిన ప్రధాని… అదే అంశంతో స్వాతంత్య్ర దినో త్సవ ప్రసంగాన్ని ప్రారంభించడం మోడీ మార్క్‌లో మార్పుకు ఉదాహరణ. ఆ రాష్ట్రంలో ఎంతోమంది తల్లులు, సోదరీమణులు, అమాయక ప్రజలు అమా నుషమైన దాడులకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూనే, దేశ ప్రజలందరి సానుభూతి, మద్దతు మణి పూర్‌ ప్రజలకు ఉందని ధైర్యం చెప్పారు. దేశ ప్రజలను ఎప్పటి మాదిరిగానే సోదరసోదరీమణు లు అని కాకుండా, తన కుటుంబ సభ్యులంటూ సంబో ధించడం యాదృచ్చికం కాదు. ఆర్థికం గా భారత్‌ని ఐదవ స్థానం నుంచి మూడవస్థానానికి తీసుకురావడం, కరోనా నిర్మూలన కోసం వ్యాక్సిన్‌ కనుగొని ప్రపంచానికి అందిం చడం, జి-20 దేశాల కూటమికి నేతృత్వం వహించే అవకాశం దక్కడం వంటి అంశాలను ప్రస్తావించారు.

చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులను కలిగిస్తున్నా, వాటిని దాటుకుని ముందుకు సాగే ధైర్యాన్ని దేశం పుణికి పుచ్చుకున్నది. దారిద్య్రరేఖ దిగువ నుంచి 13.5 కోట్ల మందిని బయటపడేయగలగడం సామాన్యమైన విష యం కాదు.ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భం గా నర్సులు, గ్రామ వికాసానికి కృషి చేసిన సర్పంచ్‌లు 1800 మందిని ఆహ్వానించారు. స్వాతంత్య్ర దినోత్సవం లో ఈసారి కనిపించిన ప్రత్యేకత ఇది. ఈ ఏడాది దేశం లోని కొన్ని చోట్ల వరదలు, మరికొన్ని చోట్ల అనావృష్టి సంభవించినా ఆహారధాన్యాల ఉత్పత్తి సంతృప్తికరం గానే ఉంది. సాంకేతిక రంగంలో భారత్‌ సాధించిన అభివృద్ధిని ప్రధాని వివరించారు. భవిష్య త్‌లో 6-జి వినియోగం ప్రజల జీవన విధానంలో పెను మార్పులు తీసుకుని వస్తుందన్న మోడీ వ్యాఖ్యల్లో అతిశయోక్తి లేదు. 2047 నాటికి మన దేశం అగ్రరాజ్యాల సరసన స్థానం సంపాదించేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. అందుకు తగిన ఉత్తేజం.. విశ్వాసం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం అందించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement