Monday, April 29, 2024

సర్వశుభప్రదం వరలక్ష్మీ వ్రతం

సౌభాగ్యానికి, సకల భోగభాగ్యాలకు, అష్టైశ్వర్యాలకు, లక్ష్మీ కటాక్షం పొందటానికి ఉత్తమమైన వ్రతం వరలక్ష్మీ వ్రతం.
వర అంటే శ్రేష్ఠమైనది, కోరుకున్నది. ఉత్తమమైన వరాలు వరలక్ష్మీ వ్రతం ప్రసాదిస్తుంది. వరలక్ష్మీ వ్రతం మహత్తరమైన వ్రతం. మహోత్కృ ష్టమైన వ్రతం. భృగు మహర్షి కూతురిగా లక్ష్మీదేవి అవతరించినది శ్రావణ శుక్రవారం నాడే. శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడే లక్ష్మీదేవి భృగు మహర్షి యింట జన్మించిందని పురాణాల ఆధారంగా చెబుతారు. ఈ కార ణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతానికి తిథి, నక్షత్ర, సమయాలతో సంబంధం లేదు. వార మే ప్రధానం. ఏదైనా కారణం చేత పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వీల వని వారు, శ్రావణ మాసంలోని ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చును. భక్తి ప్రపత్తులతో ఎవరు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారో, వారికి లక్ష్మీదేవి కటాక్షం, సిరిసంపదలు కలుగుతాయి. సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు. అష్టలక్ష్ములు అనబడే ఎనిమిది శక్తులైన ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మీ మాతల అనుగ్రహం ప్రాప్తించి భూ సంపద, ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద యిత్యాది సర్వ సంపదలూ కలుగుతాయి.
నిజానికి శ్రావణ మాసమే అతి పుణ్యమైన మాసం. ”ద్వాదశేష్యసి మాసే షు శ్రావణ: శివ రూపక:” అంటే పన్నెండు నెలలలో శ్రావణం శివ స్వరూపం. శ్రావణ మాసం నేనేనని సాక్షాత్తూ పరమ శివుడే సనత్కుమా రునికి చెబుతాడు.
శ్రావణ మాసం లక్ష్మీదేవి పుట్టిన మాసం. శ్రవణం నక్షత్రానికి అధిపతి విష్ణువు. శ్రావణ మాసం పండుగల నెల. వ్రతాల మాసం. పుణ్యమాసం. ధన్య మాసం. వరలక్ష్మీ వ్రతం, శివవ్రతం, శ్రావణమాస వ్రతం, నరసింహవ్రతం, జీవి తాంతికాదేవి వ్రతం, హనుమత్‌ వ్రతం. యిలా వివిధ తిథి వారాల్లో నెల పొడుగునా వ్రతాలే. పవిత్రత శ్రావణంలో జరుపుకునే వ్రతం వరలక్ష్మీ వ్రతం కాబట్టి ఈ వ్రతం మరెంతో ప్రశస్తమైనది అని వేరే చెప్పక్కర్లేదు. వరలక్ష్మీ వ్రత ప్రస్తావన భవిష్యోత్తర పురాణంలో ఉంటుంది. వరలక్ష్మీ వ్రత విశేషాలను పరమ శివుడు పార్వతీదేవికి వివరిస్తాడు. పూర్వకాలంలో అందాలతో అలరారే కుండినమను పట్టణంలో చారు మతి దేవి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. చారుమతికి లక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమై, శ్రావణ మాసంలో పున్నమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసుకోమని, అలా చేస్తే అఖండమైన వరాలు ప్రసాదిస్తానని చెబు తుంది. స్వప్న వృత్తాంతాన్ని చారుమతి బంధువులందరికీ చెప్పడం వలన, చారుమతితో కలసి బంధువులంతా, పూర్ణకుంభ మందు వరలక్ష్మిని ఆవా హన చేసుకుని, కల్పంలో చెప్పబడిన ప్రకారం వరలక్ష్మీ వ్రతం చేసుకుంటా రు. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని,సకల ఐశ్వర్యాలను పొందుతారు. అప్పటి నుండి వరలక్ష్మీ వ్రతం ప్రసిద్ధి చెందిందని శివుడు పార్వతికి చెబుతాడు. వ్రతం చేసుకున్న మర్నాడు కలశాన్ని తప్పకుండా దానం చేయాలి. ప్రతి మతో కూడా కొందరు వ్రతం చేసుకుంటారు.తెల్లవారు జామున నిద్రలేచి, యిల్లూ వాకిలీ శుభ్రం చేసుకుని, తలంటు పోసుకుని, శుభ్రమైన బట్టలు కట్టుకుని, శుచీశుభ్రతలతో, భక్తితో శక్తిని అను సరించి వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకోవాలి. పూజ అయింతర్వాత, పసుపు రాసిన దారాన్ని అయిదు/తొమ్మిది పో గులు వేసి, అయిదు/తొమ్మిది పూవులు పెట్టి, అయిదు/ తొమ్మిది ముడులు వేసుకున్న ‘తోరాన్ని’ తయారుచేసి వరలక్ష్మీదేవి ముందర పెట్టి, ‘తోరగ్రంధి’ నామాలు చదివి పూజచేయాలి వ్రతం పూర్తయిన తర్వాత ఒక తోరం లక్ష్మీదేవికి వుంచి, ఒకటి తీసుకొని కుడిచేతికి కట్టుకోవాలి. అనంతరం వండిన పిండి వంటలను వరలక్ష్మీదేవికి నివేదన చేయాలి. ముఖ్యంగా ఐదు రకాలైన అన్నాలు… అంటే దద్దోజనం, ఆవుపాలతో చేసిన పాయసం, పులిహోర, పులగం, గుడాణ్ణం (బెల్లంతో చేసిన పొంగలి) నైవే ద్యంలో ఉండాలి. బూరెలు/ బొబ్బట్లు తప్పకుండా నైవేద్యంలో ఉండాలం టారు కొందరు. తర్వాత చక్కని నిష్ట గలిగిన ఓ ముసలి బ్రాహ్మణునికి పన్నెండు బక్ష్యాలను దక్షిణ తాంబూలాదులతో వాయనమివ్వాలి. తర్వాత బంధుమిత్రులతో కలిసి భుజించాలి. సాయింత్రం ముత్తైదువులకు శనగలు, అరటిపండ్లు, తమలపాకులు, వక్కలు, దక్షిణ పెట్టి తాంబూలాలు ఇవ్వటం ఆచారం. మహిళలు తమ భర్త ఆయురారోగ్యాలతో జీఇంచాలని, తాము దీర్ఘ సుమంగళిగా కలకాలం ఉండాలని ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వ్రతానికి ఉద్యాపన లేదు. కులాలకు అతీతంగా అన్ని కులాల వారూ వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటారు. దివ్యమైనది… కోరిన కోర్కెలు తీర్చేది… భవ్యమై నది… వరలక్ష్మీ వ్రతం. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో తన భక్తులను… లోకాలను కాచే వ్రతం.

  • రమాప్రసాద్‌ ఆదిభట్ల, 93480 06669
Advertisement

తాజా వార్తలు

Advertisement