Wednesday, May 1, 2024

వైద్యనాథ జ్యోతిర్లింగము

శ్లో॥ పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే,
సదావసంతం గిరిజా సమేతం
సురాసురా రాధిత పాదపద్మం,
శ్రీ వైద్యనాథం తమహం నమామి ॥

భావము: తూర్పు – ఉత్తరముల మధ్యయైన ఈశాన్యపు దిక్కున “ప్రజ్వల్య” అనే చోట “యెల్లప్పుడూ పార్వతీదేవితో నివసిస్తూ, దేవతలు – రాక్షసులచేత పూజింపబడు పాద పద్మములు గల శ్రీవైద్యనాథునకు నమస్కరిస్తున్నాను. (ఇక్కడి దేవి – జయదుర్గాత్రిపుర సుందరీదేవి. ఇది అష్టాదశశక్తి పీఠాలలో ఒకటి – దీనిని సతీదేవి హృదయము పడినచోటంటారు.

పురాణగాధ :
త్రేతాయుగంలో రావణాసురుని తల్లి ‘కైకసి’ ఒకనాడు సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగము (సైకత లింగము) ను చేసి పూజిస్తూవుండగా సముద్ర కెరటాలు తెలింగాన్ని ముంచి కొట్టుకొని పోవునట్లు చేశాయి. అందుకామె చాలా విచారంగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె పట్ల బాధపడుతూ వుండటాన్ని చూసిన రావణుడు తల్లిని కారణమడుగగా ఆమె జరిగినదంతా చెప్పింది. దానికి రావణుడు “సైకత లింగము పాడయినదని విచారిస్తున్నావా? చూడు ఆ పరమేశ్వరుడినే ఇక్కడకు తీసుకువస్తాను’ అని చెప్పి ఈశ్వరుని గూర్చి హిమాలయాలలో ఘోర తపస్సు చేశాడు. ఎంత కాలము గడచినా శివుడు ప్రత్యక్షం కాకపోవుటచే రావణుడు మరింత దీక్షగా శివుని పూజిస్తూ నైవేధ్యంగా తన పది తలలలో ఒక్కొక్క తలను ఖండించి సమర్పించడం మొదలుపెట్టాడు. చివరకు పదియవ తలను కూడా ఖండించబూనగా శివుడు ప్రత్యక్షమై రావణుని పూర్వం వలెనే తొమ్మిది తలలను వాటి స్థానంలలో అమర్చి, యేదేని ఒక వరం కోరుకొమ్మని అనుగ్రహించాడు. “దానికి రావణుడు శివుని తనతో లంకానగరమునకు వచ్చి నిత్యం తను, తనవారు పూజించుకొనే అవకాశమును కల్పించమని కోరాడు. అపుడు శివుడు తన ఆత్మ లింగమును రావణునకిచ్చి “రావణా! ఇది గొప్ప మహిమగలది. సర్వాభీష్ట ఫలములను ఇస్తుంది. దీనిని నీవు లంకలో నుంచి పూజించుకొనుము. అయితే దీనిని నీవు తీసుకు వెళ్లునపుడు మధ్యలో ఎక్కడను భూమిపై పెట్టరాదు సుమా! ఒకసారి భూమిపై పెట్టబడినచో అది అక్కడనే ప్రతిష్ఠింపబడుతుంది. జాగ్రత్త సుమా! అని చెప్పి మాయమయ్యాడు.

రావణుడు ఆ లింగమును చేతులలో పెట్టుకొని లంకకు ప్రయాణమయ్యాడు. ఈ విషయం దేవతలకు తెలిసి చాలా భయపడ్డారు. వారు గణేశుని వద్దకు వెళ్ళి ‘రావణుడు యెట్టి వరములు లేకుండానే ప్రజలను, మునులను, దేవతలను రకరకములుగా బాధిస్తున్నాడు. ఇక ఈ శివుని ఆత్మలింగమును లంకకు తీసుకువెళ్తే అతని ఆగడములకు అడ్డు వుండదు. కాబట్టి అతడు దానిని లంకకు తీసికొని వెళ్ళకుండా చూడమని’ విధాలుగా ప్రార్థించారు.

విఘ్నేశ్వరుడు సరేనని రావణుని అనుసరిస్తూ సమయం కోసం చూస్తున్నాడు. ఇంతలో సాయం సమయమయ్యింది. రావణుడు త్రికాల సంధ్యా వందనాన్ని నియమములను తు.చ. తప్పక పాటించు నిష్టాగరిష్ఠుడవడం చేత సాయంకాల సంధ్యావందనము చేయవలెననీ, తన చేతిలోనున్న శివలింగమును క్రిందపెట్టరాదనీ విఘ్నేశ్వరుడు సరేనని రావణుని అనుసరిస్తూ సమయం కోసం చూస్తున్నాడు. ములను తుచ తప్పక పాటించు నిష్టా గరిష్ఠుడవడం చేత సాయంకాల సంధ్యా వందనము చేయవలెననీ, తన చేతిలో నున్న శివలింగమును క్రిందపెట్టరాదని శివుడాజ్ఞాపించాడు. కాబట్టి దానిని యెవరి చేతిలోనైనా పెట్టితాను సంధ్యవార్చుకుందామనే ఉద్దేశంతో అటునిటు చూడసాగాడు. ఇట్టి అవకాశం కోసం యెదురు చూస్తున గణేశుడు గోపబాలకుని రూపంలో రావణునకు కన్పించాడు. అపుడు అతడు ఆ గోపబాలుని చేతిలో ఆ శివలింగము నుంచి, తాను సంధ్యావందనములు చేసి వచ్చువరకు దానిని భూమిమీద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకొనమని చెప్పి నదిలోనికి దిగాడు. రావణుడు సంధ్యావందనమున నిమగ్యుడైయున్న సమయము చూచి, అదే సరైన టైముగా భావించి గోపబాలుని రూపములో నున్న విఘ్నేశ్వరుడు ‘అయ్యా! ఈ లింగము క్షణక్షణానికి బరువైపోతోంది. దీనిని నేను మోయలేకపోతున్నాను. వేగంగా ‘రావయ్యా’ అంటూ అరవడం మొదటుపెట్టాడు. రావణుడు ఆతురతగా వస్తున్నాడు. అతడలా దగ్గరకు వస్తున్న కొలదీ, బరువును అతికష్టంగా మోస్తున్నట్లు నటిస్తూ ఇక మోయలేక వదలివేసినట్లు ఆ శివలింగాన్ని భూమిపై పెట్టేశాడు వినాయకుడు. చాలా విచారించాడు రావణుడు. అయినా బలగర్వముతో ఆ లింగాన్ని తిరిగి భూమినుండి పెకలించ డానికి యెంతో ప్రయత్నించాడు. భూమి కదలజారిందే కాని శివలింగము ఒక్క అంగుళము కూడా పైకి లేవలేదు. అయినా పట్టువిడువకుండా ప్రయత్నిస్తూనే వున్నాడు. రావణుని శరీరమంతా గాయాలతో రక్తసిక్తమయ్యింది. అపుడు అశరీర వాణి “రావణా! శివాజ్ఞను నీవు మీరగలవా! ఈ లింగాన్ని నీవు పెకలించలేవు. వృథాప్రయాసమని, ఈ లింగమును పూజించి నీ గాయముల నుండి విముక్తి పొందుము అని పలికింది. ఇక చేయునది లేక రావణుడు ఆ లింగమును అర్పించి తన గాయములను పోగొట్టుకొని స్వస్థుడై లంకకు తిరిగిపోయాడు. తర్వాత బ్రహ్మాది దేవతలందరూ అక్కడకు వచ్చి ఆ జ్యోతిర్లింగమునకు అభిషేకాది అర్చనలు చేశారు. రావణుడికి గాయములను మాన్పి స్వస్థత చేకూర్చిన కారణంగా ఆనాటి నుండీ ‘ఆశివలింగమునకు ‘వైద్యనాథ’ లింగమని పేరు వచ్చింది. ఈ లింగమును పూజించిన వారికి సకల వ్యాధులనుండి విముక్తి లభించి భోగభాగ్యములు, మోక్షములు కలుగుతాయి.

- Advertisement -

పురాణకాలంలో చితాభూమిగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రము ఈనాడు వైధ్యనాథ్ బైద్యనాథ్ ధామ్ (దేవఘర్)గా పిలువబడుతున్నది. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో జస్సిడి అను రైల్వేస్టేషనుకు 6 కి॥మీ॥ దూరంలో వుంది. వైద్యనాథ్ లింగము పేరుతో 1. మహారాష్ట్రలోని పర్లీగ్రామంలో ఒకటి, 2. నాందేడు 20కి॥మీ॥ దూరంలో గంగాఖేడ్ దగ్గర ఒకటి, 3. పంజాబ్ రాష్ట్రంలో ‘కీర’ గ్రామంలో ఒకటి, 4. హిమాచల ప్రదేశ్లో పఠాన్ కోటకు 155 కి|| మీ॥ దూరంలో ఒక లింగము వున్నాయి. ఇవన్నీ వైద్యనాథ్ పిలువబడడమేకాక, అన్నిచోట్లను స్థలపురాణముగా పైపురాణగాధనే చెప్ప‌బ‌డుతుంది. రావణుడు హిమాలయముల నుండి ఈశ్వరుని ఆత్మలింగమును తీసికొని లంకకు వస్తూండగా కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రము వద్ద విఘ్నేశ్వరుని వలన భూస్థాపిత మయ్యిందని అక్కడి వారు చెప్తారు. అక్కడి ఆ శివలింగమునకు గోకర్ణేశ్వరుడని, పార్వతికి తామ్రగౌరి అని పేర్లు.

చరిత్ర : ఈ క్షేత్రము మౌర్య సామ్రాజ్యంలోను, గుప్తసామ్రాజ్యంలోను ఒక భాగంగా వారి సేవలను పొందింది. తర్వాత పాలరాజులు, మొగలు చక్రవర్తులు, బీహార్, బెంగాల్ నవవాబుల పాలనలో నుండేది. చారిత్రకంగా చెప్పుకోదగిన విశేషాలు లేవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement