Friday, May 10, 2024

అపూర్వం… అసామాన్యం…శ్రీసాయి వైభవం!

క లియుగ దైవం, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం అయిన శ్రీ సాయినాథుని లీలలు సముద్రం వలె అనంతం. ఆయన తన భక్తుల పట్ల చూపే కరుణ అమూల్యం. తన ను మనస్పూర్తిగా నమ్మి, శరణు జొచ్చి, సర్వశ్య శరణాగతి చేసిన భక్త జనావళికి ఎల్లవేళలా రక్షణ కవచం అందించే అపూర్వ, అసామాన్య, దైవం శ్రీ శిరిడీ సాయి. పూజ, వ్రతములు, త్యాగము, సేవ, తీర్ధయాత్రలు, దానము చేయుట మొదలగు సత్కార్యముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరి పూజ తపస్సు కంటే మేలైనది. సద్గురువు యొక్క పూజ, ధ్యానము, అర్చనలు అన్నింటికంటే మేలైనవి. ఆనితర సాధ్యమైన ఆత్మ సాక్షాత్కారం సద్గు రువు కృప వలనే సాధ్యం. కావున నిరంతరం సాయిని ధ్యానిస్తూ, చెవులతో వారి లీలలను వింటూ, నోటితో సాయి నామం పలుకుతూ, వారి అతి పవిత్రమైన రూపమును మనసులో గుర్తుకు తెచ్చుకుంటూ, బుద్ధిని వారి యందు నిల్పి, హృదయం నిండా సాయిపై పవిత్రమైన ప్రేమను నిలుపుకొని మన దైనందిన కార్యక్రమాలను చేసుకుంటూ వుండాలి. ఇంతకుమించి న సాధన మరొకటి లేదు. సంశయ స్వభావం మానవుని ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డుగోడగా నిలు స్తుంది. అట్లా సంశయ స్వభావముతో శ్రీ సాయిని పరీక్షించుదామని వచ్చిన ఒక పెద్దమనిషి లీలను ఇప్పుడు స్మరించుకుందాం!
#హరి కనోబా అనే వ్యక్తి బొంబాయిలో నివసిస్తూ వుండేవాడు. తన స్నేహతుల, బంధు వుల నుండి శ్రీ సాయి లీలలను అనేకం విన్నాడు. స్వతహాగా సంశయ స్వభావం కలిగినవాడు కావడం వలన మొదట్లో శ్రీ సాయిని నమ్మలేదు. ఏవో గారడీ విద్యలు నేర్చుకొని కనికట్టు చేసే సన్యాసిలా సాయిని భావించాడు. అయితే శ్రీ సాయిని పరీక్షించుదామని ఒక శుభముహూర్తా న తన స్నేహితులతో కలిసి శిరిడీ వచ్చాడు. కొత్త బట్తలు, తలపై జలతారు పాగా, కొత్త చెప్పుల ను ధరించి దర్పంతో మశీదు లోనికి అడుగుపెట్టాడు. ఎంతో ధనం వెచ్చించి కొన్న కొత్త చెప్పు లను మశీదులో ఒక మూల వుంచి సాయి దర్శనం చేసుకొని ఊదీ ప్రసాదాలను అందుకొని తిరిగి వచ్చాడు. దురదృష్టవశాత్తు తాను వుంచిన ప్రదేశంలో తన కొత్త చెప్పులు దొరకలేదు. చికాకు పడుతూ మసీదు అంతా వెదకినా చెప్పులు కనిపించలేదు. అనవసరంగా శిరిడీ వచ్చి చెప్పులు పోగొట్టుకున్నానని బాధపడుతూ తన బసకు తిరిగి వచ్చాడు.
తర్వాత అన్యమనస్కంగానే హరి కనోబా స్నానం చేసి, దేవునికి పూజ చేసి, నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు. కాని మనసులో చెప్పుల గురించి చింత వదలలేదు. ఎంతో జాగ్ర త్తగా ఎంపిక చేసి, ఇష్టంగా కొనుకున్న చెప్పుల జత మాయమైపోయిందేనన్న బాధ అతనిని తొలచివేస్తోంది. అయిష్టంగానే భోజనంచేసి వాడా వసారాలోకి వచ్చి కూర్చున్నాడు. అప్పు డు ఒక కుర్రవాడు ఒక చెప్పుల జత వేలాడుతున్న కర్రను భుజానికి తగిలించుకొని హరీకా బేటా, జరీకా ఫేటా (తలపాగా) అని అరుచుకుంటూ వస్తున్నాడు. ఆ చెప్పుల జత తనవిగా అనిపించడంతో పరుగు పరుగున హరి కనోబా వెళ్ళి ఆ కుర్రవాడిని ఆపాడు. ఆ కుర్రవాడు తనని వివరాలు అడుగగా, తన పేరుకని కనోబా యని, తన తండ్రి పేరు కనోబాయని, తాను బొంబాయి నుండి వచ్చానని చెప్పాడు. అప్పుడు ఆ కుర్రవాడు ఆ చెప్పుల జతను హరి కనోబాకు ఇచ్చివేసి తనను శ్రీ సాయి పంపారని, కనోబా కుమారుడైన హరి కనిపిస్తే వానికి జరీ అంచు తలపాగా వుందని రూఢీ చేసుకొని, వివరాలను కనుక్కొని చెప్పుల జతను ఇచ్చి వేయ మని ఆదేశించారని చెప్పాడు. ఆ మాటలకు హరి కనోబా నోటి వెంట మాటరాలేదు. తాను సాయి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్క మాటైనా మాట్లాడలేదు. అటువంటిది ఆయనకు తన వివరాలు ఎలా తెలిసాయి? దానిని బట్టి శ్రీ సాయి సర్వాంతర్యామియని, ఈ సృష్టిలో జరిగే సమస్తం ఆయనకు తెలుస్తుంటాయని హరి కనోబాకు అవగతమయ్యింది. వెంటనే శ్రీ సాయి దర్శనార్ధం మశీదుకు వెళ్ళాడు. పశ్చాత్తాప హృదయంతో శ్రీ సాయి కాళ్ళపై పడి తనను క్షమించమని కళ్లనీళ్ళ పర్యంతమై ప్రార్ధించాడు. శ్రీ సాయి చిరునవ్వుతో హరి కనోబా వైపు తన కరుణామృత చూపులను ప్రసరించగా, ఆ క్షణంలో హరి కనోబా హృదయంలో అంతవ రకు దట్టంగా పేరుకొనిపోయి వున్న సంశయాత్మక స్వభావం పటా పంచలైపోయింది. దాని స్థానే అంతులేని విశ్వాసం చోటుచేసుకుంది. శ్రీ సాయిని పరీక్షించుదామన్న తన వైఖరికి తానే సిగ్గుపడ్డాడు. శ్రీ సాయి దివ్యత్వాన్ని, #హత్యాన్ని స్వయంగా అనుభవించి ఆయన పట్ల అం తులేని భక్తి విశ్వాసాలను పెంచుకున్నాడు. శ్రీ సాయికి అత్యంత భక్తుడిగా మారి తన జీవిత కాలం పర్యంతరం శ్రీ సాయి సేవ, ఆరాధనలో మునిగిపోయాడు.
ఒక చిన్న లీల ద్వారా సంశయాత్మక వైఖరిని తొలగించి గొప్ప ఆధ్యాత్మిక జాగృతిని కలి గించి, భక్తునిగా మార్చిన శ్రీ సాయి వైభవం అపూర్వం, అసామాన్యం. మనం కూడా మన విజ్ఞానంతో, బుద్ధితో ప్రతీ విషయన్ని పరిశీలించి, తర్కించి, విమర్శించే వైఖరిని విడనాడు దాం. ఆధ్యాత్మికతకు కావల్సింది అచంచల భక్తి విశ్వాసాలు, నమ్మకం మాత్రమే! ఏ మేరకు మనలో భక్తి ప్రవృత్తులు, విశ్వాసాలు చోటు చేసుకుంటాయో, ఆ మేరకు భగవంతుని అను గ్ర#హం అతి శీఘ్రంగా లభిస్తుంది. ఇది సత్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement