Sunday, May 5, 2024

నేటి రాశి ఫ‌లాలు(7-6-2022)

మేషం….సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

వృషభం…కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం….రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో తొందరపాటు-. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం…ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటు-ంది. సన్నిహితులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సింహం…సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉన్నతస్థితి.

- Advertisement -

కన్య….అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరుత్సాహం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందర గోళం.

తుల…..సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం….దూరప్రయాణాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు మరింత పెరుగుతాయి.

ధనుస్సు…నూతన పరిచయాలు. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మకరం….కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. కొత్త నిర్ణయాలు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం….వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం….సన్నిహితులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement