Sunday, April 28, 2024

నేటి రాశిఫ‌లాలు(23-03-2024)

మేషం: ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. శారీరక రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: రుణాలు చేస్తారు. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: ఆకస్మిక ధనలాభాలు. పోగొట్టు-కున్న వస్తువులు దక్కుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. యత్నకార్యసిద్ధి. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: పనుల్లో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటు-ంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యావకాశాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

- Advertisement -

కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. పరిస్థితులు అనుకూలించవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తులాభాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. దైవదర్శనాలు. ధన లబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభకు గుర్తింపు పొందుతారు. ఆర్థిక ప్రగతి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. కుటు-ంబసభ్యులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మకరం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటు-ంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

కుంభం: రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ధనలాభం. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

Advertisement

తాజా వార్తలు

Advertisement