Wednesday, May 1, 2024

తిరుప్పావై : పాశురము – 19

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

కుత్తువిళక్కెరియ క్కోట్టుక్కాల్‌ కట్టిల్‌మేల్‌
మెత్తెన్ఱ పఞ్చశ యనత్తిన్‌ మేలేఱి,
కొత్తలర్‌ పూఙ్గళల్‌ నప్పిన్నెకొఙ్గె మేల్‌
వైత్తుక్కి డన్దమలర్‌ మార్‌పా! వాయ్‌తిఱవాయ్‌
మైత్తడ ఙ్కణ్ణినాయ్‌! నీ యున్మణాళనై
ఎత్తనైపోదుమ్‌ తుయిలెళ వొట్టాయ్‌కాణ్‌!
ఎత్తనై యేలుమ్‌ పిరివాత్తగిల్లాయాల్‌
తత్తువ మన్ఱు త్తకవే లో రెమ్బావాయ్‌.

ఆండాళ్‌ తిరువడిగలే శరణం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌ స్వామి వారి మంగళాశాసనములతో…

తాత్పర్యము :
” గుత్తి దీపములు వెలుగుచుండగా దంతవు కోళ్ళుగల మంచముపై, మెత్తనైన అయిదు లక్షణములు గల పాన్పుపై నధిరోహించి, గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూవులు కేశములందు ధరించిన నీలాదేవి స్తనముల నానుకొని శయనించియున్న విశాలమైన వక్ష:స్థలము గల ఓ దేవా! నోరు తెరువుము(అనగా) ఒకమాటను పలుకుము. కాటుకచే విశాలమగు కన్నులు గలదానా!నీ ప్రియుని ఒక క్షణమైనను నిద్రనుండి మేల్కొననీయవు కదా! నీవు ఒక్క క్షణమైనను స్వామి విరహమును ఓర్వలేనిచో అది నీ స్వరూపమునకు తగదు. స్వబావమునకు తగదు.”
శ్రీమన్నారయణ తత్త్వము నెరిగించు జ్ఞానమే దీపము.
దీని గుత్తులు – 1. శ్రుతి, 2. స్మృతి, 3. ఇతిహాసము,4. పురాణము,5. ఆగమములు. కులయాపీడ మనగా అహంకారము.
దంతములు 4,1 కర్తృత్వాహంకారము,2. భోక ్తృత్వహంకారము, 3. జ్ఞాతృత్వాహంకారము, 4. శేషత్వాహంకారము.
పడకనున్నఅయిదు లక్షణములు – అర్ధ పంచకము. కేశపాశము – వ్యామోహ జనకమగు శేషత్వము
పూలగుత్తులు – అహింసాది అష్ట పుష్పములు
స్తనములు – పరభక్తి, పరమభక్తి
కన్ను – జ్ఞానము
కాటుక – భక్తి

- Advertisement -

డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు

Advertisement

తాజా వార్తలు

Advertisement