Sunday, May 26, 2024

బాబా దివ్య బోధనలు

”సాయిబాబా తన గొప్ప తనమెన్నడూ ప్రద ర్శించాలని అనుకోలే దు. అంతేగాక సాయిబాబా సామాన్య మానవుని వలె కని పంచినప్పటికీ, వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారిని తెలుస్తుం ది” అంటారు హేమాద్‌పంత్‌. ఇది సందర్భానుసారంగా బయ టపడుతుండేది. తనను కలవ డానికి వచ్చిన వారితో సాయి బాబా అనేక విషయాలు మాట్లా డేవారు. వేదాలని, భగవద్గీతనీ, ఈశావ్యాసోపనిషత్తును, ఖురా న్‌ను, బైబిల్‌ను ఉటంకిస్తూ బాబా తనవైన మాటలు చెప్పే వారు. ప్రత్యేకించి బోధనలు చేయలేదుగానీ మానవ జీవన తాత్వికతని గురించి అనేకానేక విషయాల్ని తనని దర్శించ వచ్చినవారితో చెప్పేవారు. అయితే ఉపన్యాసాల మాదిరిగా ఆయ న ఏ విషయాన్ని కూ డా సుదీర్ఘంగా వివరించలేదు. క్లుప్తంగా, సంక్షి ప్తంగా భావగర్భితంగా తన అభిప్రాయాల్ని చెప్పేవారు. కొన్ని సార్లు చిన్నచిన్న కథల రూపంలో వివరించే వారు. అవి ఎంతో శక్తి వంతంగా వుండి ఆలోచింప జేసేవి. అయితే ఆయన మాటలు విన డానికి, ఆ మాటల్లోని విలువైన సారాంశాన్ని గ్రహించడానికి షిరిడీ వాసులేకారు, బాబాని దర్శించ వచ్చిన వారు ఆసక్తి చూపేవారు. ఒక సందర్భంలో బాబా భక్తులకు చెప్పిన ఈ కింది మాటలు అందరూ సదా గుర్తుంచుకోవాలి.
”ఏదైన సంబంధముండనిదే యొకరు ఇంకొకరి వద్దకు వెళ్ళరు. ఎవరుగాని యెట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చిన చో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వానిని సాదర ముగా చూడుము. దాహ వ ుు గలవారికి నీరిచ్చిన చో, ఆకలితోనున్నవారికి అన్న ము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా యితరులు కూర్చొను టకు విశ్రాంతి తీసికొనుటకు వినియోగించినచో నిశ్చయ ముగా భగవంతుడు మిక్కిలి ప్రీతిజెందును. ఎవరైన ధన సహాయము గోరి నీవద్దకు వచ్చి నచో, నీకిచ్చుటకు ఇష్టము లేకు న్న నీవు ఇవ్వనవసరం లేదు. కాని వానిపై కుక్కవలె మొఱగ వద్దు. ఇతరులు నిన్నెంతగా నింది ంచిన ను, నీవు కఠినముగా జవాబును ఇవ్వకుము. అట్టి వానిని నీవెల్లప్పుడు ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును.” ఎంత విలువైనవి ఈ మాటలు. సాటి మనుషులకు సహాయం చేయవలసి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో బాబా బాగా చెప్పారు. అలాగే మనల్ని ద్వేషిం చేవారి పట్ల మన వ్యవహారసరళి ఎలా ఉండాలో సరిగ్గా సూచిం చారు. ”అపకారికి ఉపకారం నెపమెన్నక చేయు వాడు నేర్పరి సుమతీ” అన్న శతకకారుని మాటలలోని సారాంశం బాబా బోధ నల్లోనూ కనిపిస్తుంది. బాబా ఉపదేశాల్లో భగవద్గీత సారం, బైబిల్‌ సారాంశము, ఖురానులోని పవిత్రమైన అంశాలు కలగలసి వుం టాయి. నిజానికి వీటన్నిటి సారం మానవుని శ్రేయస్సు, సకల శత్రుత్వాలు, అసూయాద్వేషాలు మరచి మానవు లు శాంతిగా మనుగడ సాగించటమన్నదే సర్వమతాల లక్ష్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement