Tuesday, June 4, 2024

TS: సీఎం రేవంత్ ను క‌లిసిన‌ నందమూరి బాలకృష్ణ

తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత, టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ‌ ఉద‌యం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు.

అనంత‌రం ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించారు. ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు ఉన్నారు. మరోవైపు సినిమా సంగతులు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. సినిమా రంగం అభివృద్ధి గురించి బాలయ్య బాబు రేవంత్ తో చర్చించారు. ఈ సందర్భంగా బాలయ్య సినిమాల గురించి రేవంత్ ముచ్చటించారు. ఆయన సినిమాలంటే తనకు ఇష్టమని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement