Sunday, April 28, 2024

శ్రీరాముడి సోదరి శాంతాదేవి!

వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ గాథ అందరికి పుక్కిటి పురాణం. అయితే శ్రీరామచంద్రమూర్తికి ఒక అక్క ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే రామాయణ గాథ శ్రీరాముని జననం నుంచి మాత్రమే ప్రసిద్ధిపొందింది. రామ జననానికి ముందు దశరథ మహారాజు- కౌసల్య దంపతులకు కూతురు పుట్టింది. ఆమె పేరు శాంత. దశరథుడుకు నలుగురు పుత్రులు కలగడానికి ముందే కూతురును తన ప్రాణ స్నేహితుడు అయిన రోమపాదుడుకి దత్తత ఇచ్చాడు. ఈమె కథ వాల్మీకి రామాయణం బాలకాండలో 9-18 సర్గలలోనూ, విష్ణుపురాణం 18వ అధ్యాయంలో ప్రస్తావించబడింది.

దశరథమహారాజు, కౌసల్యలకు జన్మించిన ప్రథమ సంతానం శాంత. ఆ మె తరువాత వారికి చాలాకాలం పిల్లలు కలగలేదు. ఒకరోజు అంగదే శానికి రాజు, దశరథుని సహ విద్యార్థి, మంచి స్నేహితుడు అయిన రోమపాదుడు స్నేహితుడు రాజ్యం అయిన అయోధ్యకు పర్యటనకు వస్తాడు. రోమపాదుడు పిల్లలు తప్ప అన్నిరకాల సుఖసంపదలతో రాజ్యపాలన చేస్తున్నాడు. పిల్లలు లేరన్న బాధ తమ దంపతులను కలచివేస్తోందని, అందుకుగాను దశరథుని కు మార్తె శాంతను దత్తత ఇవ్వమని కోరతాడు. గొప్ప మనసుగల దశరథ మహారా జు తనకున్న ఏకైక కుమార్తె అయినప్పటికీ స్నేహితుడి కోరికను తిరస్కరించలేక శాంతను దత్తత ఇచ్చాడు. శాంతకు రోమపాద పెంపుడు తండ్రి అయ్యాడు.

అంగరాజ్యంలో తీవ్ర కరువు

వయసు పెరుగుతున్న కొద్దీ శాంత అతి సౌందర్యవతిగా మారింది. అంత్య త మేధావి అయిన ఆమె వేదాలు, కళలు, హస్తకళలు, యుద్ధ విద్యలు నేర్చుకుం ది. సకల విద్యలలో ప్రావీణ్యం సంపాదించింది. ఒకరోజు తండ్రీ కూతుళ్లు మా ట్లాడుకుంటుండగా ఇంద్రుని భక్తుడు అయిన ఒక పేద బ్రాహ్మణుడు తనకు వ్యవ సాయానికి సహాయం చేయమని అడగడానికి రాజు వద్దకు వస్తాడు. రోమపాదు డు అతన్ని పట్టించుకోడు. దాంతో బ్రాహ్మణుడు కోపోద్రిక్తుడై రాజ్యాన్ని విడిచిపె ట్టి వెళ్లిపోతాడు. అందుకుగాను ఇంద్రుడు రోమపాదుడుపై కోపగించి అంగరా జ్యంలో వర్షపాతాన్ని తగ్గించాడు. ఫలితంగా తీవ్ర కరువు ఏర్పడింది.

కరువు నివారణ

- Advertisement -

చింతించిన రాజు కరువు నివారణకు తన రాజ్యంలో పండితులైన బ్రాహ్మ ణులను పరిష్కార మార్గం అడుగుతాడు. ‘విభాండకుడు’ అనే ముని పుత్రుడు అయిన ఋష్యశృంగ మహర్షిని రాజ్యానికి రప్పించి అతని కుమార్తె శాంతను ఇచ్చి వివాహం చేయమని వారు చెబుతారు. రాజు దానికి అంగీకరిస్తాడు. కానీ నిష్కపటమైన బ్రహ్మచర్యంతో అడవిలో తపస్సు చేస్తూ జీవించే ఋషిని రాజ్యాని కి తీసుకురావడం ఎలా, ఋష్యశృంగుడి తండ్రి విభాండకుడు చాలా కఠినాత్మకు డు, ఆయనకు కోపం వస్తే రాజ్యమంతా శపిస్తాడేమోనని అందరూ భయపడతా రు. మంత్రులందరూ కలిసి అతనికి ఎలాంటి కళంకం అంటకుండా రాజ్యానికి తీసుకురావడానికి పథకం రచిస్తారు.
అందమైన వేశ్యలను అలంకరించి వారితో అనేక బహుమతులను అడవికి పంపుతారు. వేశ్యలు ఋష్యశృంగ మహర్షి ఆశ్రమానికి సమీపంలో బసచేస్తారు. అతని దృష్టిలో పడాలని వారు అతని ఆశ్రమం చుట్టూ తిరుగుతూంటారు. ఒక రోజు అతను వాళ్ళని చూస్తాడు. వారు అతని దగ్గరకు వెళ్ళి స్నేహం చేస్తారు. అయి తే ఆ ముని తండ్రి ఎప్పుడైనా వచ్చి తమను శపిస్తాడేమోనని వారు భయపడి తిరిగి వెళ్ళిపోతారు. వెళ్లేటప్పుడు అతన్ని కౌగిలించుకుని, తీపిపదార్థాలను ఇస్తా రు. ఋషి అవి ఏవో పండ్లు అనుకుని తింటాడు. వారి నిష్క్రమణ తరువాత ముని హృదయం కలతపడుతుంది. మరుసటిరోజు అతను వేశ్యలున్న ప్రదేశానికి వెళ తాడు. వేశ్యలు అతనికి స్వాగతం పలికి తమ ఆశ్రమంలో ఇంకా అనేక రకాల పం డ్లు ఉన్నాయని, విలక్షణమైన ఆతిథ్యం ఉంటుందని చెబుతారు. వారి మాటలు విని ఋష్యశృంగుడు అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా ఆ స్త్రీలు ఋష్యశృంగుడిని అంగరాజ్యంలోకి తీసుకెళతారు.

ఋష్యశృంగ మహర్షితో శాంత వివాహం

ఋష్యశృంగుడు అంగరాజ్యంలోకి ప్రవేశించిన వెంటనే, వానదేవుడు వర్షా న్ని కురిపించాడు. కరువు తీరింది. అంగరాజు రోమపాదుడు అతనికి స్వాగతం పలికి ఎంతో గౌరవిస్తాడు. శాంతను ఇచ్చి వివాహం చేస్తాడు.

శాంత తోబుట్టువుల జననం

అయోధ్యలో దశరథుడు సంతానం లేక బాధపడతాడు. తన రాజ్యానికి వారసుడిగా కొడుకు కావాలనుకుంటాడు రాజు. అందుకుగాను పుత్రకామేష్ఠి యజ్ఞం చేయాలని నిర్ణయించుకుంటాడు. అందరితో సంప్రదిస్తాడు. రథసారధి, మంత్రులలో ఒకరైన సుమంత్రుడు యజ్ఞకర్మకు అధ్యక్షుడుగా ఋష్యశృంగుడిని నియమించమని సలహా ఇస్తాడు. ”ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి రాజుకు నలుగురు కుమారులను అనుగ్రహిస్తాడని సనత్కుమారుని ప్రవచనం ద్వారా తాను విన్నాన”ని సుమంత్రుడు చెబుతాడు. అదివిన్న దశరథుడు అంగరాజ్యా నికి వెళ్లి ఋష్యశృంగుడు, శాంతలను అయోధ్యకు పంపమని అభ్యర్థిస్తాడు. రోమపాద స్నేహితుని కోరికను మన్నించి శాంత, ఋష్యశృంగులను అయోధ్య కు పంపిస్తాడు. తన భర్తతోపాటు అయోధ్యకు వచ్చిన పెద్దపెద్ద కళ్లతో అత్యంత సౌందర్యంగా వున్న శాంతను చూసి రాజభవనంలోని స్త్రీలందరూ తమ ఇంటి బిడ్డ ఇన్నిరోజులకు తమ ఇంటికి వచ్చినందుకు ఆనందించి మర్యాదలు చేస్తారు.
యజ్ఞం ముగిసిన పిమ్మట అగ్నిదేవుడు దశరథుడికి పాయసం పాత్రను అందజేయడం, దానిని తన ముగ్గురు భార్యలకు సమానంగా పంచడం, కొంత కాలానికి నలుగురు పుత్రులు జన్మించడం నుంచి రామాయణగాథ అందరికీ తెలి సిందే. యజ్ఞ కృతువుకు ఆచారత్వాన్ని విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత ఋష్యశృంగుడు, శాంత, రోమపాదుడు తిరిగి అంగ రాజ్యానికి వెళ్ళిపోతారు.
కర్ణాటకలోని కిగ్గాలో, నేపాల్‌లోని లలిత్‌పూర్‌లో, హిమాచల్‌లోని కులుకు 50 కిమీ దూరంలో ఋష్యశృంగ, శాంతాదేవిల ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. వీరిని దర్శించుకునేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తే శ్రీరాముని అనుగ్రహా నికి పాత్రులవుతారని భక్తుల విశ్వాసం.

Advertisement

తాజా వార్తలు

Advertisement