Friday, May 3, 2024

సీత ఏమని శ్రీరాముని ప్రార్థించింది

వాల్మీకి రామాయణములో తొమ్మిదవ సర్గలో రాముడు సుతీక్ష మహర్షిని సందర్శించిన అనంతరం, సీత రామునితో స్నేహభరితంగా, మనోహరంగా తన మనసులోని మాటలను పలికిం ది. ఆమె ధర్మం గురించిన పలికిన పలుకులు శిరోధా ర్యాలు. భార్యగా ఆమె తన కర్తవ్యాన్ని నిర్వర్తించే దిశగా ఆ మాటలు సాగిపోయాయి.
మహాధర్మ సంపాదనము చాలా సూక్ష్మముగా ఆలోచించి మాత్రమే చేయవచ్చు. కామం నుండి పుట్టే వ్యసనాలకు దూరంగా ఉన్నవాడే ఈ లోకంలో ధర్మా న్ని సంపాదించగలడు. కామం వలన మూడు వ్యస నాలు కలుగుతాయి. వాటిలో అసత్యం పలకడం అనే ది పెద్ద వ్యసనము. పరభార్యాగమనము, వైరం లేకుండానే క్రూరంగా ప్రవర్తించడం అనే రెండూ కూడా చాలా చెడ్డవి. నీకు ఈ మూడింటి నుండీ ప్రమాదం లేదు. నీవు ధర్మాత్ము డవు, సత్యసంధుడవు, తండ్రి ఆజ్ఞను పాలించువాడవు. ధర్మమూ సత్యమూ కూడా నీయందే ఉన్నాయి. నీవు ఇంద్రి యములను జయించిన వాడివి. సత్య సంధత్వము మొదలై న గుణాలను కాపాడుకొనగలవు. అయితే రామా, మూడవ దైన భయంకరమైన వ్యసనము, ఏవిధమైన వైరం లేకుం డానే, తెలివితక్కువతనం చేత పరుల ప్రాణములు తీయ డం అనేది ఆకస్మికంగా నీకు వచ్చినది. దండకారణ్యంలో నివసించే ఋషులను రక్షించడానికై, యుద్ధంలో రాక్షసుల ను సంహరించెదను అని నీవు ప్రతిజ్ఞ చేసావు. ఈ పని చేయ డానికి, నీ సోదరునితో కలిసి, ధనుర్బాణాలు ధరించి బయలుదేరావు. అది చూసి నా మనస్సు చింతాకులమైంది.
రామా నీవు దండకారణ్యానికి వెళ్లడం నాకిష్టం లేదు. నీవు సోదరునితో కలసి అక్కడవున్న మృగాలపై బాణప్ర యోగం చేస్తావు కదా? అగ్నికి సమీపంలోవున్న కట్టెలు ఎలా తేజోబలాన్ని వృద్ధి పొందిస్తాయో, అలానే క్షత్రియుల దగ్గ రున్న ధనుస్సు క్షత్రియుల బలాన్ని వృద్ధి పొందిస్తుంది.
పూర్వం ఒక పవిత్రమైన ఆశ్రమంలో సత్యమునే పలికే పరిశుద్ధుడైన ముని నివసించేవాడు. మృగాలు, పక్షులూ ఆశ్రమంలో సుఖంగా నివసించేవి. ఒక రోజు ఇంద్రుడు అత ని తపస్సు విఘ్నం చేయడానికైభటుని రూపంలో వచ్చాడు. అతని చేతిలోని ఖడ్గాన్ని పుణ్యమైన తపస్సు చేస్తున్న ముని కిచ్చి, దీనిని కొంతకాలం నీ వద్ద ఉంచు, మరలా వచ్చి తీసు కుంటాను అన్నాడు. మునీశ్వరుడు అది మొదలు తన విశ్వా సాన్ని నిరూపించుకోడానికీ, ఆ న్యాసాన్ని రక్షించడానికై ఆ వనంలో ఆ ఆయుధంతోనే సంచరించేవాడు. ఆయన ఫలా లనూ, మూలాలనూ సేకరించేందుకు వెళ్ళినా ఆ ఖడ్గము తోనే వెళ్ళేవాడు. అలా ఆయుధమును ధరించు మునీశ్వరు నకు క్రమంగా తపస్సుపై శ్రద్ధ తగ్గిపోయింది. ఆయుధం దగ్గర వుండటం వలన, మునీశ్వరుడు తన కర్తవ్యాన్ని మర చి, క్రూరమైన హింస యందు అభిరుచి కలిగినవాడై, అధ ర్మంచేత ధర్మం దుర్బలం కాగా నరకాన్ని పొందాడు. శస్త్ర సంబంధమూ, అగ్ని సంబంధమూ ప్రమాదానికి హేతువు లు. నీపై నాకున్న ప్రేమ చేత, గౌరవ భావం చేత నీకు నేను ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానే గాని, నీకు తెలియని విష యాన్ని చెప్పాలనే ఉద్దేశ్యంతో మాత్రం కాదు. ధనుస్సు ధరించిన నీకు దండకారణ్యంలో నివసించే రాక్షసులను, వారితో ఏవిధమైన వైరం లేకుండానే, చంపాలనే ఆలోచన కలగటం ఏమాత్రం మంచిది కాదు. వీరుడా! ఏ అపరాధ మూ చేయనివారిని చంపటం నాకు సమ్మతం కాదు. వనం లో నివసించే కోరికతో వున్న వీరులకూ, క్షత్రియులకూ ధనుస్సు వలన ప్రయోజనం ఆర్తులను రక్షించటం మాత్ర మే. మనం దేశ ధర్మాన్ని పూజించాలి. ఆయుధం పట్టడం వలన మనస్సు వికారం చెందుతుంది. నీవు తిరిగి అయో ధ్యకు వెళ్ళిన పిమ్మట అక్కడ క్షత్రియ ధర్మాన్ని పాలించ వచ్చును. నీవు రాజ్యాన్ని విడిచి పెట్టి, అరణ్యవాసానికి వచ్చి నందుకు, తపోనిరతుడైన మునివి అయితే, నా అత్తమామ లు తమ వాక్యాన్ని పరిపాలించావని చాలా సంతోషిస్తారు. ధర్మము అర్థమునకు కారణము. ధర్మము సుఖంనిస్తుంది. ధర్మంచే మానవుడు సమస్తాన్నీ పొందగలడు. ఈ జగత్తు లో సారమైనది ధర్మమొక్కటే. నీకు ధర్మాన్ని బోధించగల వారెవ్వరూ. నీ తమ్మునితో కూడా ఆలోచించు. ఎలా ఇష్టం అయితే అలా చేయుము అంటూ భక్తితో సీత పలుకుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement