Wednesday, June 5, 2024

సంప్రదాయాల సిరి… ధర్మపురి

”భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస,
దుష్ట సంహార నరసింహ దురితదూర”

అనే మకుటంతో భక్తాగ్రేసరుడు శేషప్ప (కాకుస్తం శేషాచలదాసు) రచించిన నరసింహ శతకంలోని పద్యాల మాధుర్యాన్ని ఆస్వాదించని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. భారతీయ ప్రాచీన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు పట్టుకొమ్మగా, హైందవ సనాతన సంప్రదాయాలకు కేంద్ర బిందు వుగా, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలసి ఆస్తిక ప్రపంచానికి వరదాయిగా, భక్తిముక్తి ప్రదాయినిగా విరాజిల్లుతున్నది… సుప్రసిద్ధ ప్రాచీన ధర్మపురి పుణ్యతీర్థం. అవిభక్త కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి 71 కిలోమీటర్ల ఉత్తరాన, ప్రస్తుత జగిత్యాల జిల్లా కేంద్రానికి 27 కిలోమీటర్ల ఈశాన్యన, తెలంగాణ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, దక్షిణ కాశీగా, నవ నారసింహ క్షేత్రాలలో ఉత్కృష్టమైనదిగా, పౌరా ణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరిం చుకున్నది క్షేత్ర రాజం.
ప్రధానంగా శివకేశవుల నిలయమై, అపురూ పమైన బ్రహ్మ, యమ ధర్మరాజు దైవాలతో త్రైమూ ర్త్య క్షేత్రంగా, శ్రీలక్ష్మీనరసింహ, రామలింగేశ్వర ఆలయాలు, మసీదు అనాదిగా పక్కపక్కనే కలిగి, పలు క్రైస్తవ ప్రార్థనా మందిరాలతో… వైష్ణవ, శైవ ముస్లిం, క్రైస్తవ మత సామరస్యానికి ప్రతీకగా నిలచి ఉన్నదీ గోదావరీ తీరస్త పుణ్యతీర్ధం. బ్రహ్మాండ, స్కంధ పురాణాలలో, మడికి సింగన పద్మ పురాణంలో, చెరికొండ ధర్మన్న చిత్ర భారతంలో, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశికలో, ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలో, నృసింహదాసు మైరావణ చరిత్రలో, పోతనామాత్యుని నారాయణ శతకంలో, శేషాచలదాసు… నరహరి, నృసింహ, కాక తీయానంతర శాసనాలలో, మధ్యయుగ దాన పత్రాలలో ధర్మపురి క్షేత్ర ప్రాశస్త్యం ప్రశంసించబడింది. పూర్వం ధర్మవర్మ మహారాజు ధర్మదేవత భక్తుడై, ప్రజలను ధర్మ కార్యోన్ముఖుల ను చేయడానికి చేసిన తపస్సు ఫలితంగా ‘ధర్మపురి’ నామాంకితయై, నృసింహుడు భక్తుల కోర్కెలు తీర్చేందుకై ఇచ్చట వెలసియున్నాడని, పురాణాలు స్పష్టపరుస్తున్నా యి. గౌతమ మహర్షి, తన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకునేందుకు పరమశివుని గూర్చి తపస్సు చేసి, ఆయన జటాజూటంనందుగల ”గంగాదేవి”ని ధర్మపురికి రప్పిం చినందున ‘గౌతమి’, ‘గోదావరి’ అని నదీ పేర్లు వచ్చినట్లు స్థల పురాణం విశదపరుస్తు న్నది. శ్రీరామచంద్ర స్థాపిత రామేశ్వరాలయం, అక్కపెల్లి రాజేశ్వరాలయం, శ్రీరామా లయం, దత్తాత్రేయ, గౌతమేశ్వర, శ్రీసాయి శివ బాలాజీ, అయ్యప్ప, ప్రసన్నాంజనే య, భక్తాంజనేయ, యమ ధర్మరాజు, సంతోషిమాత, సత్యవతీ, మహాలక్ష్మి మందిరా లు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. రామాయణ, భారత, భాగవతాది పురాణ ఘట్టాలు చెక్కబడిన నసింహాల యపు కాకతీయుల శిల్పకళకు అద్దం పట్టే కళ్యాణ మంటపం, శివాలయం లోని గణేష చండిక, సప్తమాతకలు, నల్లశనపు రాతిపై సమంశ పద్ధతిలో చెక్కబడిన శ్రీరామలక్ష్మణ, సీతాదేవిల విగ్రహాలు మిగుల మనోజ్ఞమై ఉన్నాయి.
క్షేత్ర ప్రాశస్త్యం
అద్వితీయ మహమాన్వియైన ధర్మపురి క్షేత్రమున యాత్రికుల సౌకర్యార్ధం నివా స్థానములను కట్టించువారు భగవత్కటాక్షమున ఉత్తమ భవనముల పొందగలరని, ఇచ్చటి జీర్ణమందిరములను ఉద్ధరించువారు వైకుంఠమునందు ఉత్తమ సుఖముల ను అనుభవించగలరని, శ్రీ నృసింహుని పూజకొరకు పూలచెట్లను పెంచువారు నందనాది వనములతో సౌఖ్యములను అనుభవించగలరని, దద్ధోజనము, పులిహోర నైవేద్యం పెట్టేవారు అన్నదాతలై భగవత్కటాక్ష మునకు పాత్రులగుదురని, నృసిం హుని ప్రీతికై క్షేత్రమున బ్రాహ్మణులకు భూదానం, గోదానం, హరణ్యాది దానముల నొసంగువారు ముందు జన్మమున సార్వభౌములగుదురని, క్షేత్ర మున దీనాదులకు, దంపతులకు, బ్రహ్మచారులకు పశుపక్ష్యాదులకు అన్నదాన మొనర్చినచో, నృసింహ కటాక్షమున వారి వారి పితృదేవతలు మోక్ష మును పొందగలరని, శౌనకాది మహర్షులకు నైమి శారణ్యములో సూత పౌరాణికులు వివరించినట్లు స్కంధ పురాణాంతర్గత ధర్మపురి క్షేత్ర మహాత్మ్యం విశదీకరిస్తున్నది.
నరసింహ అవతార ప్రత్యేకత
రామకృష్ణాది అవతారములవలెగాక, నిర్యా ణంలేని శాశ్వత అవతారమైన శ్రీ నరసింహుని జయంతి, హిందూ పండగలలో అత్యంత ఆధ్యా త్మిక ప్రాధాన్యత నొందింది. వైశాఖ శుద్ధ చతుర్దశి పుణ్యతిథియందు ఉద్భ వించిన నారసింహుని పూజలతో, అకాల మృత్యుభయ ముండదని, దుష్టగ్రహ బాధ లు, పైశాచిక చేతబడుల ప్రయోగాలను తిప్పికొట్టే శక్తి నార సింహ మంత్రానికి గలదని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
”ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం”
అనే మంత్రంతో నరసింహ స్వామిని పూజిస్తే శతృజయం కలుగుతుంది. పగలు రాత్రి కాని సంధ్యా సమయాన, నరుడు జంతువు కాని రూపంతో, భూమ్యాకాశాలు కాని తొడలపై, సజీవము నిర్జీవ మూ కాని చేతిగోళ్ళతో, హరణకశిపుని చీల్చి భక్త జన రక్షకుడై, సుదర్శన, శంఖ, చక్ర, ఖడ్గ, ఆంకుశ, పాశు, పరశు, ముసల, పద్మాదులను కలిగి గదాధరుడైన ఉగ్రనారసింహ అవతారతత్వం మిగతా అవతారాలకు భిన్నం.
13 రోజుల బ్రహ్మోత్సవాలు
ధర్మపురి లక్ష్మీ సమేత నారసింహ (యోగ, ఉగ్ర), శ్రీ వేంకటేశ్వర బ్రహ్మోత్సవాలు మార్చి 14వ తేదీ నుండి 26వ తేదీ వరకు సాంప్రదాయ రీతిలో జరుగనున్నాయి. సర్వ దేవతామూర్తులను కలిగి ‘ధర్మపురిని దర్శిస్తే యమపురి ఉండదు’ అని ప్రాచీన చరిత్ర, ఈ క్షేత్రంలో ఏటా ఫాల్గుణ శుక్ల ఏకాదశి నుండి 13 రోజులు వరుసగా స్థానిక దైవాల వార్షిక ఉత్సవాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించడం అనాదిగా ఆచరణలో ఉంది. 15 వ తేదీ గోధూళి సుముహూర్తంలో స్వామి వారల కల్యాణోత్సవం, 18, 19, 20 తేదీలలో వరుసగా… బ్రహ్మపుష్కరిణీలో సాయంత్రం శ్రీ యోగానంద నరసింహ, శ్రీ ఉగ్రనరసింహ, శ్రీ వేంకటేశ్వరస్వామివారల తెప్పోత్సవం, డోలోత్సవం, 23న సాయం త్రం రథోత్సవం, 24, 25, 26 తేదీలలో మువ్వురుస్వామి వారల ఏకాంతోత్సవా లు సంప్రదాయ రీతిలో జరుగనున్నాయి.

  • రామకిష్టయ్య సంగనభట్ల
    9440595494
Advertisement

తాజా వార్తలు

Advertisement