Tuesday, June 18, 2024

మౌనం… ధ్యానం

సాయిబాబా ఏ విషయంలోనైనా వెంటనే స్పందించరు. వ్యాఖ్యానించరు. తన అభిప్రాయాన్ని తక్షణమే వ్యక్తీకరించరు. ఎక్కువసేపు మౌనంగా వుంటారు. అలా అని ఎప్పుడూ మౌనంగా వుంటారని అర్థంకాదు. కోపం వచ్చినప్పుడు అరిచేవారు. తనకు కోపం తెప్పించినవారిని తిట్టేవారు. కొన్ని సార్లు మనుషుల తీరు పట్ల తన కోపాన్ని తనలో తానే మాట్లాడుకుంటున్నట్టుగా వ్యక్తపరిచేవారు. తప్పుగా ప్రవర్తించేవారిని కేకలు వేసేవారు. అలా అప్పుడ ప్పుడు కోపం వచ్చినప్పటికీ సాయిబాబా ఎప్పుడూ శాంతముగా, సంయ మనంతో ఉండేవారు. కోపావేశాల్ని ప్రదర్శించినా శాంతమూర్తిలా కూర్చొని ప్రేమానురాగాలతో మాట్లాడేవారు. అందువల్లనే ఆయన తిట్లను కూడా దీవెనలుగానే భావించేవారు ఆయనని దర్శించవచ్చిన భక్తులు. సమయ సందర్భాల్ని బట్టి సాయిబాబా మాట్లాడుతారు. అప్పుడప్పడు మసీ దులో ఒక స్తంభానికి ఆనుకుని మౌనంగా గంటల తరబడి నిలబడిఉండేవారు. అలాగే చాలాసేపు ధునికి ఎదురుగా ధ్యానమగ్నులయి కూర్చునేవారు. ఆయన మౌనం- ధ్యానం రెండూ ఆయన చుట్టూ చేరినవారికి ఆరాధనీయ అంశాలే. బాబా దృష్టిలో మౌనంగా ఉండటమంటే స్పందించకపోవడం కాదు. అవసర సందర్భాల్లో ఖచ్చితంగా పెదవి విప్పాలి. తప్పుని తప్పుగా చెప్పితీరాలి. ఏది సరైనదో, ఏది కాదో స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే స్వభావం కూడా సాయిబాబాలో వుంది. అందుకే బాబా కొన్నిసార్లు మౌనం వీడి మనుషుల నైజం, వారు ఎలా ప్రవర్తించాలో భక్తులకు చెబుతుండేవారు. అలాగే మనుషులు నిస్వార్థంగా నీతి నిజాయితీలతో ఉదాత్తంగా జీవించాలంటే ఉపరించేది ధ్యానం అని చెప్పేవారు సాయిబాబా. అందుకే ఆయన ఎక్కువసేపు ధ్యానమగ్నులై వుండేవారు. అందరూ ఈవిధంగా వ్యవహరించాలని బాబా తన జీవితాచరణ ద్వారా చూపారు. అందుకే కష్టాల్లో వున్నప్పుడు బాబాని ధ్యానిస్తూ సాయిలీలామృతాన్ని పారాయణ చేస్తూ వుంటే కష్టాల నుండి బయటపడవచ్చు. మార్గం ఏదైనా చిత్తశాంతిని సాధించడానికే. ఎటువంటి పరిస్థితిలకు లోనుకాకుండా మాన వీయ గుణంతో కొనసాగాలి. అందుకు ధ్యానం చేయాలంటారు బాబా. ధ్యానం బాబా జీవితంలో అంతర్భాగం. ఆయన ధ్యానానికీ, మౌనానికీ సకల మాన వుల్లో మంచి నెలకొనాలన్న తపనే మూలం.

Advertisement

తాజా వార్తలు

Advertisement