Saturday, May 4, 2024

శ్రీ సుదర్శన తిరునక్షత్ర మహోత్సవ ఆహ్వానం

శ్రీ సుదర్శన తిరునక్షత్ర మహోత్సవ ఆహ్వానం

జై శ్రీమన్నారాయణ…
శ్రీ సుదర్శన నారసింహ యాగప్రయుక్త మహా మండలార్చనము శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నశ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి మంగళాశాసనములతో స్వస్తి శ్రీ శుభకృతు నామ సంవత్సర శ్రావణ శుద్ధ సప్తమి 04.08.2022 గురువారం రోజున శ్రీ సుదర్శన పెరుమాళ్‌ తిరునక్షత్ర మహోత్సవ సందర్భముగా శ్రీ సుదర్శన నారసింహ మహాయాగ ప్రయుక్త మహామండలార్చన జరుపబడును.

కార్యక్రమ వివరాలు..
04.08.2022 ఉదయం 8 గంటలకు శాంతి పాఠం, శ్రీ వి ష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, 9 గంటలకు సుదర్శన నారసింహస్వామికి నవకలశ స్నపనము. మూర్తికుంభారాధాన అర్చన. 10 గంటలకు సుదర్శన నారసింహ యంత్ర ఆవాహన, అర్చన (మహా మండలార్చ). 11 గంటలకు సుదర్శన నారసింహ హోమము, పంచసూక్త హోమము. 1 గంటలకు నివేదన, మహా పూర్ణాహుతి, మంగళాశాసనము, తీర్థగోష్ఠి. సాయంత్రం 6 గంటలకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. 6.30కు సహస్రదీపాలంకరణ సేవ, 7.30కు పల్లకీ సేవ నివేదన.

నిర్వహణ:
చక్రవర్తుల సుధన్వాచార్య (యజ్ఞాచార్య) 7093022321
భట్టరు సాయి కృష్ణమాచార్య (అర్చకులు) 9177870170
కార్యస్థలం
కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఎన్‌సీఎల్‌ సౌత్‌ రెనొవో హాస్పిటల్‌ వెనుకాల, సుచిత్ర, హైదరాబాద్‌.

శ్రీ సుదర్శన నరసింహుడి అనుగ్రహంతో శతృబాధ నివారణ, గ్రహబాధ నివారణ,
దృష్టి దోష నివారణ, మంత్ర యంత్ర ప్రయోగ బాధా నివారణ, సర్వఅభీష్ట సిద్ధి,
పదోన్నతి, తీవ్రవ్యాధి నివారణ, లక్ష్మీ కటాక్షం….. పొందుటకై ఈ యాగాన్ని నిర్వహించడం జరుగుతుంది…
యజ్ఞాచార్య

Advertisement

తాజా వార్తలు

Advertisement