Sunday, June 23, 2024

Ugadi Panchangam | శోభకృత్‌ నామ సంవత్సరంలో కుంభ‌ రాశివారికి ఎలా ఉంటుందంటే..

ఆదాయం 11, వ్యయం – 05

రాజ్య పూజ్యం 05, అవమానం – 06

గురువు 22,32023 ఉగాది నుండి 21.4.2023 వరకు మీనరాశి 2వ స్థానమై శుభుడైనందున ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు.కుటు-ంబ సౌఖ్యముంటు-ంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటు-ంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. 22.4.2023 నుండి వత్సరాంతం వరకు మేషరాశి 3వ స్థానమై సాధారణ శుభుడైనందున బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందుల నెదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటు-ంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు
పూర్తిచేసుకోలేక పోతారు.

శని 22.3.2023 ఉగాది నుండి వత్సరాంతం వరకు కుంభరాశి 1వ స్థానమై అశుభుడైనందున బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళన అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.

రాహువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు మేషరాశి 3వ స్థానమై శుభుడైనందున అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు.సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తులజోలికి వెళ్లరాదు. 31.10, 2023 నుండి వత్సరాంతం వరకు మీనరాశి 2వ స్థానమై సాధారణ శుభుడైనందున ఆకస్మిక ధనలాభయోగముంటు-ంది. కుటు-ంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణ మేర్పడుతుంది.

- Advertisement -

కేతువు 22.3.2023 ఉగాది నుండి 30.10.2023 వరకు తులారాశి 9వ స్థానమై సాధారణ శుభుడైనందున స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వాయిదా వేసుకోక తప్పదు.31.10.2023 నుండి వత్సరాంతం వరకు కన్యారాశి 8వ స్థానమై అశుభుడైనందున అనవరమైన భయాందోళనలు తొలుగుతాయిప్రయానాలు జాగ్రత్తగా చేయుట మంచిది.వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement