Wednesday, May 1, 2024

సమతా కుంభ్ – 2023 మహోత్సవం..


ఈ రోజు ఉదయం యాగశాల ప్రాంగణంలోని ఆచార్య సన్నిధిలో ప్రధమంగా గురుపరంపర అనుసంధానం జరిగింది. తర్వాత అంగన్యాసం, కరన్యాసం సహిత మంత్ర అనుష్ఠానం భక్తులతో చేయించారు. యాగశాలలో భగవంతుని ఆరాధన సేవా కాలం, శాంతిపాఠం, వేద విన్నపాలు, వేద పారాయణాలు ఆరంభమయ్యాయి. పెరుమాళ్ల పాద తీర్థాన్ని భక్తులందరికీ శ్రీ చినజీయరు స్వామివారు స్వయంగా అనుగ్రహించారు. పూర్ణాహుతి వేద విన్నపాలు, ప్రసాద వితరణ, యాగశాలలో యజమానులకు మంగళా శాసనాలతో కార్యక్రమం సుసంపన్నమైంది. ఆ తర్వాత నిత్య పూర్ణాహుతి, బలిహరణ కార్యక్రమాలు జరిపించారు.

18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ

నిన్న సాయంత్రం గరుడ వాహనంపై వేంచేసిన 55 నుంచి 72 వరకు ఉన్న 18 మంది దివ్యదేశ పెరుమాళ్లకు ఉత్సవ శ్రమ పరిహారార్దం పంచకలశ స్పపన కార్యక్రమం జరిపించారు.

- Advertisement -

విశేష ఉత్సవాల్లో భాగంగా సామూహిక పుష్పార్చన నిర్వహించారు.

విశేష ఉత్సవాల్లో ఈ రోజు సాయంత్రం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు.
తెప్పోత్సవం..

మధ్యాహం సమతా కుంభ్‌ 2023లో భాగంగా భగవద్గీతలో సూపర్‌ మెమొరీ టెస్ట్‌ నిర్వహించారు. శ్రీ చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. భగవద్గీత.. పాశ్చాత్య పోకడలో పడి ఈ తరం విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు కాదు కదా.. అసలు భగవద్గీత అంటేనే మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్పే ప్రయత్నం చేయడం లేదు.. స్కూల్స్‌కి అయితే అసలే పట్టడం లేదు. సమతా మూర్తి సన్నిధిలో విద్యార్థులు భగవద్గీతను అవపోసన పట్టారు. దివ్యదేశాల బ్రహ్మొత్సవాల సందర్భంగా నిర్వహించిన సూపర్‌ మెమొరీ టెస్ట్‌లో అధ్యాయం, శ్లోకం నంబర్ చెబితే చాలు.. ఆ శ్లోకం మొత్తం వెంటనే చెప్పేస్తున్నారు. అంతే కాదు శ్లోకం చెబితే చాలు అది ఏ అధ్యాయంలో ఉందో చెబుతున్నారు. మరియు శ్లోకంలోని చిన్న పదం చెప్పినా శ్లోకం మొత్తం వివరిస్తున్నారు. పట్టుమని పదేళ్ల వయసు కూడా లేని చిన్నారుల ప్రతిభ చూసి అక్కడున్న భక్తులే కాదు అర్చకులు సైతం నివ్వెరపోయారు. శ్రీ చినజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజ్ఞ అనే ప్రత్యేక శిక్షణా కేంద్రంలో విద్యార్థులకు చిన్నవయసు నుంచే భగవద్గీత శ్లోకాలను నేర్పిస్తున్నారు. భారత్‌లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, దుబాయ్‌, సింగపూర్‌, మలేషియాకు చెందిన విద్యార్థులు కూడా ప్రజ్ఞ తరగతుల్లో చేరి భగవద్గీత శ్లోకాలతో పాటు వైదిక సంస్కృతి, సంప్రదాయాలను అభ్యసిస్తున్నారు. ఈ రో జు జరిగిన సూపర్‌ మెమొరీ టెస్ట్‌లో అమెరికా, భారత్‌కు చెందిన ప్రజ్ఞా విద్యార్థులతో పాటు వేద విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ జీయర్‌ స్వామి మాట్లాడుతూ శక్తివంతమైన భగవద్గీతను ఇంత చిన్న వయసులో అవపోసన చేశారంటే ఈ విద్యార్థులు ఏదైనా సాధించగలరని అన్నారు. వీరిలో అద్భుతమైన శక్తి ఉందని, భగవద్గీత అధ్యయనం ద్వారా పాఠశాలలో కూడా రాణిస్తారన్నారు. చిన్న వయస్సులోనే మీకు ఉన్న పట్టుదల అభినందనీయమని, శ్రద్ధ ఉంటే మనం కూడా ఇలాంటి ప్రజ్ఞ సాధించగలమని భక్తులకు స్వామి చెప్పారు. పిల్లలచే భగవద్గీత శ్లోకాలు విన్నవారికి సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానం లభిస్తుందని, పిల్లలకు, ఆచార్యులకు, తల్లిదండ్రులకు మంగళశాసనాలు తెలియచేశారు. భగవద్గీత అధ్యయనంతో పాటు చాలా మంది విద్యార్థులు విష్ణు సహస్ర నామాలు కూడా అవధానం చేస్తున్నారని, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని జీయర్‌ స్వామి అన్నారు.

దీన్ని ప్లవోత్సవం అని కూడా అంటారు. ప్లవము అంటే ఒక నావ. అందులో 18 దివ్యదేశ మూర్తులను వేంచేయింపజేశారు. దానికి పూర్వరంగంగా విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనము జరిపించారు. ఆ ప్లవోత్సవాంగ హోమం చేసి విరజానదిని ఆవాహన చేసి ఉపచారాలు అర్పించారు. సమతా క్షేత్రం వెనుక ఉన్న కోనేరులో నదీ పూజ చేసి, స్వామివారు విహరించే తెప్పకు అర్చన చేశారు. ఆ తర్వాత స్వామివారిని అందులో వేంచేయింపజేసి వేదాది పారాయణలతో, భగవంతుడి నామ సంకీర్తనలతో, ఆచార్యుల ప్రవచనాలతో ఈ తెప్పోత్సవాన్ని వైభవంగా జరుపించారు. సాధారణంగా మనం తెప్పోత్సవాన్ని అక్కడక్కడ మాత్రమే దర్శనంచేసుకుని ఉంటాం. ఎక్కడైనా ఒక మూర్తిని మాత్రమే చూడగలుగుతాం.. లేదా ఇద్దరు మూర్తులను మాత్రమే దర్శించుకుంటాం. కానీ సమతా కుంభ్‌ బ్రహ్మోత్సవాల్లో మాత్రం ఏకంగా 18 దివ్యదేశ మూర్తులకు ఉత్సవాలు జరిపించారు.

రాత్రి నిత్యపూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత తిరువీధి సేవ, మంగళాశాసనం, తీర్థ, ప్రసాద గోష్ఠి నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement