Saturday, May 18, 2024

నేటి రాశిఫలాలు(25-06-2022)

మేషం: వ్యవహార విజయం. అరుదైన ఆహ్వానాలు. విందువినోదాలు. కాంట్రాక్టులు పొందుతారు. సోదరుల నుంచి శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృషభం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో అకారణ వైరం. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: కుటు-ంబసభ్యులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. కార్యక్రమాలలో అవరోధాలు. ఉదర సంబంధిత రుగ్మతలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: కార్యక్రమాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

సింహం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహం.

- Advertisement -

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితుల నుంచి విమర్శలు. కాంట్రాక్టులు చేజారతాయి. కృషి ఫలించదు. కార్యక్రమాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

తుల: కుటు-ంబసభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కార్యక్రమాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: కుటు-ంబంలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. చర్చలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధువులు, స్నేహితులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: స్నేహితులతో వివాదాలు పరిష్కారం. ఆస్తిలాభం. బంధువుల నుంచి ఆహ్వానాలు. కళాకారులకు ఊహించని అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలపరిస్థితి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. కుటు-ంబంలో అదనపు బాధ్యతలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement