Thursday, April 25, 2024

మానసిక విశ్లేషణా శాస్త్రం సుందరకాండ

బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా!!
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్‌ స్మరణాద్భవేత్‌!!

వాల్మీకి విరచిత రామా యణమే ఒక సం పూర్ణ మానసిక శాస్త్రం. ఒక జీవి ఆధ్యాత్మిక జీవితానికి దర్ప ణం. అందునా సుందరకాండ బహు సుందరంగా మాన సిక సంఘర్ష ణను చూపించి విజయానికి ఎలా పయనమ వ్వాలో నిరూపిస్తుం ది. అయోధ్యలో ప్రజ లు ఎంత గొప్పవారో వివ రిస్తారు. ధర్మం గురించి చెబు తారు. అదే లంకలో నగరం ఎంత సుందరమో చెబుతారు. ఇక్కడ భౌతికంగా ఎంత ఉన్నతంగా ఈ నగరం వుందో విశ్లేషణ చేస్తే అయో ధ్యలో ధార్మికత, ఆధ్యాత్మికత గురించి చెబుతారు వాల్మీకి మహర్షి.
దశరధుడు అన్నదే పంచకోశ పాంచ భౌతిక శరీరం, అతడి ముగ్గురు భార్యలే ఆ జీవికి సంబంధిత ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలతో యజ్ఞం చేసి ధర్మార్ధ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు సాధించడం!
అదే లంకలో రజోగుణ దశకంఠ రావణుడు, తమో గుణ కుంభకర్ణుని మట్టుబెట్టి సత్త్వ గుణ విభీషణుని నిలబెట్టడం.
మన మనస్సులో ఆలోచనలే ఒక పెద్ద వానర సమూహం, దాన్ని నియంత్రించి కామం దాచిన జీవాత్మను పరమాత్మకు చేర్చడమే లంకా పయన, రావణ సంహార ఘట్టం. నూరు యోజనాలు దాటడానికి తనకున్న బలం మీద నమ్మకం లేకపోతే జాంబవంతుడు అతడికి తన బలం గురించి తెలియ చేస్తే రివ్వున లంకకు పయనమ య్యాడు పవన సుతుడు. ఆయన ఎన్నో చోట్ల తల్లి సీతమ్మ కోసం వెతుకుతాడు. చూడరాని ఎన్నో సన్నివేశాలను చూసాడు. కానీ తనకు మానసిక దౌర్భాల్యం, లౌక్యం లేదని సమాధానపడి సీతమ్మ కోసం వెతుకుతూ తిరుగు తుంటాడు స్వామి హనుమ. ఎంత వెదకినా తల్లి కనబడక ఎంతో నిరాశకు గురవుతాడు. అసలు తల్లి దొరకకపోతే తాను అక్కడే వుండి తపస్సు చేసుకుందామని, లేదా ప్రాయోపవేశం చేసి తనువు చాలిద్దామని ఎన్నో ఆలోచనలు. అందునా కొన్నికొన్ని సంద ర్భాలలో ఎంతో నిస్పృహకు గురై సాక్షాత్తు హనుమంతుల వారే ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు. దాని నుండి ఎలా బయటపడాలో ఆయన ద్వా రా చూపెడతారు వాల్మీకి.
ఎక్కడి కక్కడ సమాధాన పరుచు కుంటూ ముందుకు కదులుతాడు. జీ వించి వుంటే ఎప్ప టికైనా విజయం సాధ్యం అవుతుం దని హనుమం తుని ఆలోచన ద్వారా మనకు సందే శం ఇస్తాడు మహర్షి.
ఒకానొక సమయం లో ఈ రాక్షసులు సీతమ్మను తినేసారా అని భీతిల్లి తానక్కడ నిరాహారంగా నిర్వాణం పొందుదా మని ఆలోచిస్తాడు. ఇంతలో వివేకం తొంగి చూసి అసలు దీనికి కారణం అయిన రావణుని చంపి పాతరే ద్దామని, లేదా కట్టి తీసుకెళ్ళి రాముని ముందు పడేద్దా మని మరల రోమాంచితుడవుతాడు.
చివరకు హనుమంతునికి సీతమ్మ దర్శనం అవు తుంది. ఎంత గొప్పవారికైనా క్లేశాలు తప్పవు, అసలు సీతమ్మే ఇటువంటి స్థితికి వచ్చిందంటే కాలం ఎంత బలీ యమైనదో అనుకుంటాడు.
ఇక్కడ ఒక కార్యం సాధించవలసి వచ్చినప్పుడు మనకు కూడా ఎదురయ్యే సంగతులే. ఎంతో ప్రయత్నం చేసినా కొన్నిసార్లు ఎక్కడా కూడా ఆ ఫలితం కన బడడం లేదని డీలాపడిపోతాము. మరికొంత ప్రయత్నం చేస్తే సాధించవచ్చు అన్న ధైర్యాన్ని కోల్పోతాము. మనవంటి వారికి ధైర్యం చెప్పడానికి అతి బలవంతుడైన హనుమంతునే ఎదురుగా పెట్టి మనకు పాఠం నేర్పుతారు. ఎన్నటికీ ధైర్యం కోల్పోకూడదని, సమయం ఆసన్నమైనప్పుడు, మన ప్రయత్న లోపం ఏమీ లేనప్పుడు తప్పక మనకు ఫలితం దక్కుతుంది. పారాయ ణం వలన ఆ మంత్రరాజ ఫలితంగా ఆధిదైవిక అడ్డంకులుంటే అవన్నీ తొలగిపోతా యి. ఆ ఘట్టాలు మనం పూర్తి గా చదవడం వలన తత్త్వం బోధపడి, మనమీద మనకు నమ్మకం కుదిరి మన ప్రయ త్నాలను మరింత జాగ్రత్తగా పదును పెట్టి ముందుకు వెళ్లి విజయాన్ని సాధించగలుగుతాము.

Advertisement

తాజా వార్తలు

Advertisement